Wednesday, May 8, 2024

ఢిల్లీ యువతికి జాక్‌పాట్… రూ.22 లక్షల నజరానా

- Advertisement -
- Advertisement -

Aditi Singh, awarded ₹22 lakh for revealing bug in Microsoft cloud system

మైక్రోసాఫ్ట్ క్లౌడ్‌సిస్టంలో బగ్ కనిపెట్టినందుకు…

న్యూఢిల్లీ :ఇంటర్నెట్ వల్ల ఎన్నో పనులు సులువుగా జరుగుతున్నా సెక్యూరిటీ మాత్రం సమస్యగా మారింది. సైబర్ నేరగాళ్ల నుంచి కాపాడుకోవడం ఆయా కంపెనీలకు పెద్ద కసరత్తే. ఎప్పటికప్పుడు సెక్యూరిటీ ప్రోగ్రాములను మార్చుకుంటున్నా ఒక్కోసారి కొన్ని లోపాలు అలాగే ఉండిపోతుంటాయి. ఈ లోపాలను గుర్తించిన వారికి నజరానాలు ఇస్తూ ఆయా కంపెనీలు తమను తాము కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటాయి. తాజాగా మైక్రోసాఫ్ట్‌కు ఎదురైన ఓ సమస్యను గుర్తించి ఢిల్లీకి చెందిన యువతి అదితిసింగ్ రూ.22లక్షల నజరానా అందుకోగలిగింది. 20 ఏళ్ల అదితిసింగ్ మెడికల్ ఎంట్రెన్సులో సీటు రాకపోవడంతో ఎథికల్ హ్యాకింగ్‌పై దృష్టి కేంద్రీకరించింది. ఇప్పటివరకు ఆమె దిగ్గజ కంపెనీల్లోని సుమారు 40 వరకు బగ్‌లను కనుగొనగలిగింది. తాజాగా మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సిస్టంలో రిమోట్ కోడ్ ఎక్స్‌క్యూషన్ బగ్‌ను కనిపెట్టి భారీ నగదు బహుమానంగా పొదింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News