Monday, April 29, 2024

ప్రైవేట్‌కు దీటుగా మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రి

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ : నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు అన్న స్థాయి నుంచి నేను పోత బిడ్డో సర్కారు దవాఖానాకు అన్న స్థాయికి ప్రభుత్వ ఆసుపత్రులను తీసుకువచ్చామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా. వి. శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శుక్రవారం ఆయన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానాలో కోటీ రూపాయల వ్యయంతో నిర్మించిన తెలంగాణ రేడియాలజీ హబ్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఒకప్పుడు మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖానా దుర్గంధంతో నిండి ఉండేదని, నెలలో కనీసం 20 కాన్పులు అయ్యేవి కాదని, ఒకే ఒక్క ఫార్మసీస్టు, ఒక ల్యాబ్ టెక్నీషియన్ , 25 మంది న ర్సులు , 30 మంది పని వారు ఉండేవారని, అలాంటిది ఇప్పుడు 37 మంది ఫార్మసిస్టులు, 44 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, 250 మంది నర్సులు, అలాగే వర్కర్ల సంఖ్యను పెంచుకోవడం జరిగిందని, ఐసి యూ బెడ్లతో సహా, ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేశామని తెలిపారు.

అత్యంత అధునాతన టెక్నాలజీతో కోటీ రూపాయల వ్యయంతో నిర్మించిన తెలంగాణ రేడియాలజీ హబ్‌ను ప్రారంభించుకున్నామన్నారు. ప్రైవేట్ ఆసుపత్రికి దీటుగా మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిని తీర్చిదిద్దుతున్నామని, అన్ని సౌకర్యాలతో పాత కలెక్టరేట్ స్థాన ంలో సూపర్ స్పెషాలిటి ఆసుపత్రిని నిర్మిస్తున్నామని , ఒక సంవత్సరంలోపే దానిని పూర్తి చేస్తామని, మహబూబ్‌నగర్‌లో ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ వైద్యాన్ని అందిస్తామని, గతంలో సర్కార్ దవాఖానాకి వెళ్లాలంటే ప్రజలు భయపడి నేను రాను బిడ్డ సర్కారు దవాఖానాకి అనే పరిస్థితి ఉండేదని, అలాంటిది ఇప్పుడు నేను వస్తాను బిడ్డ సర్కారు దవాఖానాకు అనే పరిస్థితికి తీసుకువచ్చామని తెలిపారు.

సమావేశానికి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పర్యవేక్షకులు డా. రాం కిషన్ అధ్యక్షత వహించగా, ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల డైరెక్టర్ డా. రమేష్, హెచ్‌ఓడి ప్రి న్సిపల్ డా. రాధా , డా. కిరణ్, డా. జీవన్, డిఎంహెచ్‌ఓ డా. భాస్కర్, ఆసుపత్రి అభివృద్ధ్ది కమిటీ స భ్యులు లక్ష్మీ, సత్యం యాదవ్, మున్సిపల్ వైస్ చై ర్మన్ గణేష్, మున్సిపల్ కౌన్సిలర్లు, టిఎస్‌ఎంఐడిసి ఈఈ జైపాల్‌రెడ్డి, డాక్టర్లు, సిబ్బంది , ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News