Friday, April 26, 2024

యుఎస్‌లో ‘అలా అమెరికాపురములో’…

- Advertisement -
- Advertisement -

Ala america puramlo cinema shooting

టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్ల్లో అమెరికాలో పర్యటించనున్నారు. వాషింగ్టన్ డి.సి., చికాగో, న్యూజెర్సీ, శాన్‌జోస్, డల్లాస్‌లలో ప్రత్యక్ష ప్రదర్శనలు ఇవ్వనున్నారు. దీనిలో భాగంగా యుఎస్‌లో ‘అలా అమెరికాపురములో’ పేరుతో హంసిని ఎంటర్‌టైన్‌మెంట్ ఏర్పాటు చేసిన అతి పెద్ద మ్యూజిక్ కార్నివాల్‌లో పాల్గొననున్నారు. తమన్ బృందంలో శివమణి, నవీన్, ఆండ్రియా జెరెమియా, శ్రీ కృష్ణ, పృథ్వి చంద్ర, హరిక నారాయణ్, శ్రుతి రంజని, మనీషా, రోషిని, శాండిల్య, జోబిన్ డేవిడ్, సుభాశ్రీ, రాకేశ్ చారి, ఓషో వెంకట్, సిద్ధాంత్ వంటి ప్రతిభావంతులైన ప్రదర్శనకారులు ఉన్నారు. ఈ కాన్సర్ట్ట్‌కు టాలీవుడ్ టాప్ డైరెక్టర్, స్టార్ హీరో ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. చాలా మంది స్టార్ హీరోయిన్లు, ఇతర సినీ ప్రముఖులు తమన్‌తో కలిసి ప్రదర్శనలు ఇవ్వనున్నారు. రష్యన్, బెలారస్ నృత్యకారు లు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రత్యేక కళాకారులు తమ పర్‌ఫార్మెన్స్‌తో ఈ ఈవెంట్‌ను రక్తి కట్టించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News