Saturday, April 27, 2024

ప్రియుడి సొరంగ మార్గం

- Advertisement -
- Advertisement -

Alberto set up tunnel to meet his Girlfriend

 

టిజూవానా : ఈ బంధం అటువంటిది. మెక్సికోవాలా ఒకరు తన ప్రియురాలిని గుట్టుచప్పుడు కాకుండా కలుసుకునేందుకు సొరంగ మార్గం ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియురాలు వివాహిత. దీనితో ఆమెను కలుసుకునేందుకు ఈ టన్నెల్ దారిని ఎంచుకున్నాడు. అల్బెర్టో అనే ఈ వ్యక్తి ప్రియురాలిని ఆమె భర్త ఇంట్లో లేనప్పుడు ఈ దారిన వెళ్లుతూ వస్తూ ఉన్నాడు. అయితే ఓ దశలో ఆయన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆమె భర్త ఆయనను పట్టుకున్నాడు. విల్లాస్ డెల్ పార్డో సమీపంలోని టిజౌనాలోని తన ఇంటి నుంచి అతి పొడవైన టన్నెల్‌ను గర్ల్‌ఫ్రెండ్ కోసం ఏర్పాటు చేసుకున్నట్లు వెల్లడైంది. ప్రియురాలి భర్త జార్జ్ ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయం చూసుకుని అల్బెర్టో ఈ టన్నెల్ నుంచి ప్రియురాలి వద్దకు వెళ్లేవాడు. ఓ రోజు వేసిన తలుపులు వేసినట్లే ఉండగా లోపల అల్బెర్టో ఉండటంతో జార్జ్ కంగుతిన్నాడు. ఇంటి నుంచి అల్బెర్టో ఇంటివరకూ అతి పెద్ద సొరంగ మార్గం ఉన్నట్లు కనుగొన్నాడు. అల్బెర్టో వివాహితుడు. భార్యకు ఏమీ తెలియకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ తన రహస్య జీవితం సాగిస్తున్నట్లు ఇప్పుడు గుర్తించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News