Friday, May 17, 2024

ఆలిండియా దళిత రైట్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శిగా ఎర్ర దయాకర్ నియామకం

- Advertisement -
- Advertisement -

All India Dalit Rights Federation General Secretary

మనతెలంగాణ/హన్మకొండటౌన్: ఆలిండియా దళిత రైట్స్ ఫెడరేషన్ హన్మకొండ, వరంగల్ జిల్లాల జనరల్ సెక్రటరిగా ఎర్ర దయాకర్‌ను నియమించినట్లు ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు మోకినపల్లి జ్ఞానసాగర్ తెలిపారు. ఈసందర్భంగా జ్ఞాన సాగర్ మాట్లాడుతూ.. ఫెడరేషన్ భారతదేశంలో ఎనిమిది రాష్ట్రాల్లో దళిత, ఆదివాసి, బహుజన, మైనార్టీ మహిళల హక్కుల కొరకు పోరాటం చేస్తుందని, ఫెడరేషన్ పోరాటాల్లో పాలుపంచుకొని ఫెడరేషన్ బలోపేతం కోసం కృషి చేయాలని దయాకర్‌కు సూచించారు. ఈసందర్భంగా దయాకర్ మాట్లాడుతూ.. తనకు జిల్లా జనరల్ సెక్రటరిగా బాధ్యతలు అప్పగించినందుకు రాష్ట్ర కమిటీకి, జిల్లా అధ్యక్షుడు జ్ఞానసాగర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News