Friday, May 17, 2024

సంకల్పం ఉంటే ఏదైనా సాధించ వచ్చు

- Advertisement -
- Advertisement -

ఐఏఎస్‌గా ఎంపికైన మేఘన అభినందన సభలో
ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండి దేవుల పల్లి ప్రభాకర్‌రావు

Anything achieved Hard work and perseverance

మన తెలంగాణ, సిటీబ్యూరో: కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని ట్రాన్స్‌కో అండ్ జెన్‌కో సీఎండి దేవుల పల్లి ప్రభాకర్‌రావు అన్నారు. మంగళవారం మింట్ కంపౌండ్‌లో తెలంగాణ స్టేట్ ఎస్టీ,ఎస్టీ అసోసియేషన్ సమావేశం జరిగింది.ఈ కార్యక్రామనికి ముఖ్య అతిథిగా ఆయన విచ్చేశారు. ఈ సమావేశంలో ఆల్‌ఇండియా సివిల్ సర్వీసెస్‌లో 83వ ర్యాంక్ సాధించిన కావలి మేఘనను ఆయన సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ సంకల్పం గట్టిదైతే లక్షంగా చిన్నదిగా మారుతుందన్నారు. అనుకున్న లక్షాన్ని సాధించిన మేఘనను ఆయన ఈ సందర్భంగా అభినందించారు. ఐఏఎస్‌గా ఎంపికయిన మేఘన మన సంస్థలో డైరక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న కావాలి రాములు కుమార్తె కావడం మనకు ఎంతో గర్వకారణమన్నారు.ఈ కార్యక్రమంలో టిఎస్‌ఎస్‌పిడీసీఎల్ (దక్షిణతెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ) సీఎండి జి.ఘుమారెడ్డి ఇతర అసోసియేషన్ నాయకులు , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News