Monday, May 6, 2024

బహుముఖ నటుడు అనిపించుకోవాలన్నదే నా కోరిక

- Advertisement -
- Advertisement -

తన మార్క్ కామెడీ సినిమాతో థియేటర్స్‌లో ప్రేక్షకులను నవ్వించడానికి ‘బంగారు బుల్లోడు’గా వస్తున్నాడు అల్లరి నరేష్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా శనివారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా అల్లరి నరేష్ మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…

బంగారం లోన్స్ చుట్టూనే…
ఈ సినిమాలో నా రోల్ అంతా బంగారం లోన్స్ చుట్టూనే తిరుగుతుంది. అయితే ఓ రోజు మా ప్రొడ్యూసర్ అనీల్ సుంకర ఈ సినిమాకు ‘బంగారు బుల్లోడు’ అనే టైటిల్‌ను సూచించారు. మాకు నచ్చింది కాబట్టి ఈ టైటిల్ పెట్టాము. అంతే కానీ బాలకృష్ణ సినిమాకు దీనికి ఎలాంటి సంబంధం ఉండదు.
అందుకే ఈ సినిమా చేశా…
ఒక విలేజ్ కామెడీ సినిమా వచ్చి చాలా కాలమైంది. నేను కొన్ని కామెడీ సినిమాలు చేశాను కానీ చిన్న టౌన్స్ తరహావి చేశాను. అయితే ఈ స్టోరీ విన్నాక దీనికి ఎంటర్‌టైన్‌మెంట్‌ను జోడిస్తే బాగుంటుందని అనిపించింది. అందుకే ఈ సినిమా చేశాను. అలాగే మా సినిమాలో ఎలాంటి స్పూఫ్ కామెడీ ఉండదు.
ప్రతి అంశం పర్ఫెక్ట్‌గా…
పట్టుదలతో పనిచేసే దర్శకుడు పివి గిరి. తన సినిమాలో ప్రతి అంశం పర్ఫెక్ట్‌గా ఉండాలని అనుకుంటాడు. మా నిర్మాత సినిమా ఎలా అయితే కోరుకున్నారో అదే విధంగా ఈ సినిమాను మంచి ప్రొడక్షన్ వాల్యూస్‌తో చేశారు.
అందుకే ఆలస్యమైంది…
నేను ‘మహర్షి’ సినిమా షూట్‌లో ఉన్నప్పుడు కొన్ని విషయాలు అనుకూలించలేదు. ఆ సినిమాలో నేను వేరే లుక్‌లో ఉన్నాను. అందులోనూ పెద్ద సినిమా కాబట్టి ఆలస్యమైంది. ఆ తర్వాత కూడా మళ్లీ ఈ సినిమా షూట్ కూడా ఆలస్యమైంది. కానీ ఫైనల్‌గా 2020 సమ్మర్‌లో ఈ చిత్రం విడుదలకు ప్లాన్ చేద్దామనుకునే సరికి కరోనా లాక్‌డౌన్ వచ్చింది. చివరికి ఇప్పుడు ఈ సినిమాను విడుదల చేస్తున్నాం.
నన్ను నేను నిరూపించుకోవాలని…
నేను చిత్ర పరిశ్రమలో ఎక్కువ కాలం ప్రయాణించేందుకే వచ్చాను. నటుడిగా నన్ను నేను నిరూపించుకోవాలని అనుకుంటున్నా. అందుకే కంటెంట్ ఉన్న ‘నాంది’ లాంటి సినిమా చేశాను. అందులో చాలా కొత్తగా కనిపిస్తాను. అలాగే బహుముఖ నటుడు అనిపించుకోవాలన్నదే నా కోరిక.
చాలా స్పెషల్‌గా…
‘నాంది’ సినిమా ఖచ్చితంగా చాలా స్పెషల్‌గా ఉంటుంది. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా అవుతున్నాయి. త్వరలోనే దీని విడుదల తేదీని ప్రకటిస్తారు. ఈ సినిమాపై నేను చాలానే నమ్మకం పెట్టుకున్నాను.
తదుపరి చిత్రాలు…
ప్రస్తుతానికి నాలుగు కథలు ఓకే చేశాను. అలాగే ‘నాంది’ డైరెక్టర్‌తోనే ఇంకో సినిమా కూడా ఒప్పుకున్నా. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు మరిన్ని సినిమాలతో ఖచ్చితంగా వస్తాను.

Allari Naresh Interview about ‘Bangaru Bullodu’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News