Saturday, April 27, 2024

ఏలూరులో వింత వ్యాధి

- Advertisement -
- Advertisement -

An elusive disease in Eluru

 

250 మందికి ఆసుపత్రులలో చికిత్స
ఒకరి మృతి, మరికొందరి పరిస్థితి విషమం
వింత వ్యాధిపై అప్రమత్తం కావాలని సిఎం జగన్ ఆదేశాలు
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి : గవర్నర్

మమనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రుల్లో చేరి చికిత్సపొందుతున్నారు. ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోవడం, తలనొప్పి, ఊపిరి ఆడకపోవడం వంటి వాటితో ఇబ్బందులు పడుతూ ఇప్పటి వరకు 250మంది వివిధ ఆసుపత్రుల్లో చేరారు. ఈ వ్యాధి కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైన బాధితుల్లో ఒకరు మృతి చెందారు. ఏలూరులోని విద్యానగర్‌కు చెందిన శ్రీధర్(45) ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. తీవ్ర అస్వస్థతో ఉదయమే ఆసుపత్రిలో చేరిన శ్రీధర్‌కు వైద్యులు చికిత్స అందించినప్పటికీ ప్రాణాలు నిలవలేదు. ఇదిలావుండగా ఏలూరులో వరుసగా పిల్లలు అస్వస్తతకు గురవ్వడం కలకలకం రేపుతోంది. పడమర వీధి ప్రాంతంలో కొద్దిరోజలుగా పిల్లలు మూర్ఛలక్షణాలతో కిందపడిపోతున్నారు. ఇప్పటిదాకా దాదాపు 55 మంది పిల్లలు ఇలా అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఇంటింటి సర్వే చేస్తున్నారు. అనారోగ్యం బారిన పడ్డ పిల్లల్ని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స ఇస్తున్నారు.

ఏలూరు పడమర వీధి పెద్ద అమ్మవారి గుడి ప్రాంతంలో మూర్ఛ వ్యాధితో కళ్ళు తిరిగి కింది పడిపోతున్నట్టు స్థానికులు చెబుతున్నారు ఎమైందో తెలియని అందోళన స్థితిలో తల్లిదండ్రులు ఉన్నారు. అప్రమత్తమైన అధికారులు.. ఆరోగ్య సిబ్బందితో పడమర వీధిలో ఇం టింటికి సర్వే చేపట్టారు. ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి ఆళ్ల నా ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశించారు.

సిఎం జగన్ ఆరా..!

పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న ఘటనపై ఆంధ్రప్రదేశ్ సిఎం వైఎస్ జగన్ ఆరా తీసారు. ఈక్రమంలో వ్యాధి వ్యాప్తిపై మంత్రి ఆళ్ళ నానితోజగన్ మాట్లాడటంతోపాటు బాధితుల పరిస్థితి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సిఎం జగన్ ఆదేశించారు. ఏలూరుకు ప్రత్యేక వైద్య బృందాలను పంపుతున్నట్టు తెలిపారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని సిఎం తెలిపారు. హఠాత్తుగా కళ్ళు తిరిగి పడిపోవడం, తలనొప్పిగా ఉండటం, ఊపిరి ఆడకపోవడం వంటి వాటితో ఇబ్బందులు పడుతూ ఆసుపత్రుల్లో చేరుతున్నారని వైద్యవర్గాలు వివరించాయి.

వింతవ్యాధిపై నిపుణుల పరీక్షలు

ఏలూరులో వింత వ్యాధి వ్యాప్తిపై వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు,ఈక్రమంలో నిపుణులు విజయవాడలోని ల్యాబ్‌లకు ఏలూరు నుంచి 24 శాంపిళ్లు తరలించారు. బాధితుల నుంచి రక్త నమూనాలను సేకరించారు. బాధితుల వెన్నుముక నుంచి శాంపిళ్లను సేకరించి పరీక్షలు నిర్వహించగా రిపోర్టులన్నీ నార్మల్‌గానే ఉండటం గమనార్హం. ఇంకాకొన్ని టెస్టుల ఫలితాలు రావాల్సి ఉందని వాటికోసం మరో 24 గంటలు వేచిచూడాలని వైద్యాధికారులు చెబుతున్నారు. కాగా విజయవాడ ప్రభుత్వాస్పత్రికి ముగ్గురు ఏలూరు ఘటన బాధితులను తరలించగా. వీరిలో ఇద్దరు సురక్షితంగా ఉన్నారని మరో బాధితురాలు అబ్జర్వేషన్‌లో ఉన్నారని చెబుతున్నారు.

గవర్నర్ ఆందోళన

ఏలూరు ఘటనపై ఎపి గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ఆరా తీశారు. వందల సంఖ్యలో ప్రజలు అస్వస్ధతకు గురి కావటం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మరింత వేగవంతంగా చర్యలకు ఉపక్రమించాలని సూచించారు. సమస్యకు గల కారణలను కనుగొనేందుకు ఉన్నత స్ధాయి నిపుణుల సలహాలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖను ఆదేశించారు. మెరుగైన చికిత్సకు ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రితో ఆపాటు ఇతర ఆస్పత్రులకు తరలించాలని గవర్నర్ ఆదేశాలిచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News