Thursday, May 9, 2024

ఆ ఓట్లను కూడా లెక్కించాలి: హైకోర్టు

- Advertisement -
- Advertisement -

 GHMC Elections: Other seal vote also count

హైదరాబాద్: నేరెడ్ మెంట్ డివిజన్ ఫలితం వెల్లడికి అడ్డంకులు తొలిగాయి. ఇతర ముద్రతో ఉన్న ఓట్లను పరిగణనలోకి తీసుకునేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఇతర ముద్రతో ఉన్న 544 ఓట్లను లెక్కించాలని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే లెక్కించిన ఓట్లలో టిఆర్ఎస్ అభ్యర్థికి 504 ఓట్ల మెజార్టీ ఉంది. బిజెపి లీగల్ సెల్ ఇంఛార్జ్ అంటోనీ రెడ్డి పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికపై వివాదం ఉంటే ఎన్నికల ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాలని హైకోర్టు సూచించింది. జిహెచ్ఎంసి పరిధిలో 150 డివిజన్లు ఉండగా 149 డివిజన్ల ఓట్లను లెక్కించారు. టిఆర్ఎస్ 55 డివిజన్లు గెలుచుకోగా 38 ఎక్స్‌అఫిషియో సభ్యులు టిఆర్ఎస్ చెందిన వారే ఉన్నారు. టిఆర్ఎస్ కు మొత్తం 94 మంది సభ్యులు ఉన్నారు. కాగా మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు అవసరమైన మ్యాజిక్‌కు ఫిగర్ 102 సీట్లకుగానూ ఇంకా 8 మంది సభ్యుల మద్దతు కావాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News