Monday, April 29, 2024

ఓటు వేసేందుకు గుర్తింపు కార్డు తప్పనిసరి

- Advertisement -
- Advertisement -

An identity card is required to vote in Dubbaka

సిద్దిపేట: నవంబర్ 3న జరగనున్న దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటు వేసేందుకు గుర్తింపు కార్డు తప్పనిసరి అని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ భారతి హోలికెరి అన్నారు. గురువారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఎపిక్ కార్డు లేని వారు ప్రత్యామ్నాయంగా పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వరంగ సంస్థలు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగుల గుర్తింపు కార్డులు, బ్యాంకులు, పోస్టాపీసులు, పాస్ పుస్తకాలు, ఎన్‌పీఆర్ కింద ఆర్‌జీఐ చేసిన స్మార్ట్‌కార్డు, ఉపాధిహామీ పత్రం, ఆరోగ్యబీమా స్మార్ట్ కార్డు, ఫొటో జత చేసిన పించన్ పత్రాలు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు జారీ చేసిన గుర్తింపు పత్రం, ఆధార్‌కార్డు ద్వారా టు వేసే అవకాశం కల్పిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు.

An identity card is required to vote in Dubbaka

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News