Friday, May 3, 2024

లెస్బియన్‌గా అదరగొట్టిన అంజలి..

- Advertisement -
- Advertisement -

Anjali to act lesbian role in Netflix Movie

హాలీవుడ్‌కే పరిమితమైన లెస్బియన్ కథలు మెల్ల మెల్లగా ఇండియన్ ప్రేక్షకుల వద్దకు వస్తున్నాయి. హిందీతో పాటు ఇతర ఇండియన్ భాషల్లో కూడా లెస్బియన్ కథలతో సినిమాలు, వెబ్ సిరీస్‌లు, సీరియల్స్ వస్తున్నాయి. అయితే పేరున్న హీరోయిన్లు లెస్బియన్‌లుగా నటించేందుకు మాత్రం ఒప్పుకోరు. కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశ్యంతో లెస్బియన్‌గా నటించేందుకు ఆసక్తి చూపించరు. కాని అంజలి మాత్రం తాజాగా విడుదలైన నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ ‘పావా కదైగల్’లో లెస్బియన్‌గా నటించి అదరగొట్టింది. ప్రముఖ నటి కల్కి కోచ్లిన్‌తో ఆమె చేసిన రొమాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ వెబ్ సిరీస్‌కు నలుగురు ప్రముఖ దర్శకులు దర్శకత్వం వహించారు. ఒక్కో ఎపిసోడ్‌లో ఒక్కో కథను విభిన్నంగా చూపించారు. ఈ వెబ్ సిరీస్‌లో సాయి పల్లవి, ప్రకాష్ రాజ్, సిమ్రాన్‌లు కూడా నటించారు. అంజలి, కల్కి రొమాంటిక్ ఎపిసోడ్‌కు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించాడు. అంజలి ద్విపాత్రాభినయం చేసిన ఈ ఎపిసోడ్ మొత్తం వెబ్ సిరీస్‌కు హైలైట్‌గా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా కల్కితో అంజలి లిప్‌లాక్ సీన్, బెడ్‌రూం సీన్స్ మరో లెవెల్ అంటూ యూత్ ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Anjali to act lesbian role in Netflix Movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News