Monday, April 29, 2024

అంకిత హత్య కేసు ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు

- Advertisement -
- Advertisement -

Ankita murder case to fast track court

ఆమె కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం
ఉత్తరాఖండ్ సిఎం పుష్కర్ సింగ్ ప్రకటన

డెహ్రాడూన్: రిషికేష్ సమీపంలోని ఒక రిసార్ట్‌లో పనిచేస్తూ హత్యకు గురైన 19 సంవత్సరాల అంకితా భండారి హత్య కేసు విచారణను ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగిస్తున్నట్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగగ్ ధామి బుధవారం వెల్లడించారు. పౌరి-గఢ్వాల్ ప్రాంతానికి చెందిన అంకిత కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు. రిసార్ట్‌కు వచ్చే అతిథులకు ప్రత్యేక సేవలు(వ్యభిచారానికి వారు పెట్టుకున్న పేరు) అందచేసేందుకు అంకిత నిరాకరించడంతో రిసార్ట్ యజమాని పుల్కిత్ ఆర్య, అందులోనే పనిచేసే ఇద్దరు ఉద్యోగులతో కలిసి ఆమెను హత్య చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బిజెపి నాయకుడు వినోద్ ఆర్య కుమారుడైన పుల్కిత్ ఆర్యతోపాటు ఇద్దరు ఉద్యోగులు అంకిత్, సౌరభ్‌లను పోలీసులు గత శుక్రవారం అరెస్టు చేశారు.

అంకిత అదృశ్యమై నాలుగు రోజులైనప్పటికీ అధికార పార్టీతో సంబంధాలు ఉన్న పుల్కిత్‌ను అరెస్టు చేయకపోవడంపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో ఎట్టకేలకు స్పందించిన పోలీసులు ఈ ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. అనంతరం పుల్కిత్ తండ్రి, మాజీ మంత్రి వినోద్ ఆర్యతోపాటు ఆయన తమ్ముడు అంకిత్ ఆర్యను బిజెపి పార్టీ నుంచి బహిష్కరించింది. నాలుగు రోజుల తర్వాత అంకిత మృతదేహం సమీపంలోని ఒక కాల్వలో లభించింది. నీటిలో మునగడంతో ఆమె మరణించిందని, ఆమె శరీరంపై గాయాలు ఉన్నాయని పోస్ట్‌మార్టమ్ నివేదిక స్పష్టం చేసింది. ఇలా ఉండగా..రిషికేష్‌కు 10 కిలోమీటర్ల దూరంలో పౌరి జిల్లాలో ఉన్న వనంత్ర రిసార్ట్‌లో డ్రగ్స్ వాడకం, వ్యభిచారం నిత్యకృత్యాలని అక్కడ పనిచేసి మానేసిన ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News