Monday, April 29, 2024

విమానాశ్రయానికి మరో మార్గంలో మెట్రో: సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. బిఆర్ఎస్ సర్కార్ 12,14 గంటలకు మించి కరెంట్ ఇవ్వలేదని ఆరోపించారు. అన్ని అంశాలపై, అందరితో చర్చించి శ్వేతపత్రాలు విడుదల చేస్తామన్నారు. రేపు బిఎసీలో సమావేశాల ఎజెండాపై నిర్ణయం తీసుకుంటామన్నారు. రాయదుర్గం- ఎయిర్ పోర్ట్ మెట్రో ఉపయోగకరంగా ఉండదని తెలిపారు. విమానాశ్రయానికి మరో మార్గంలో మెట్రోనను ప్లాన్ చేస్తామన్నారు.

అటు ఎంసిఆర్ హెచ్ఆర్డీలోని ఖాళీ స్థలాన్ని వినియోగించుకుంటామన్నారు. ప్రజాభవన్ లో కార్యాలయాన్ని ఉపయోగించుకుంటానని సిఎం తెలిపారు. కొత్తగా ఎలాంటి భవనాలు నిర్మించబోమని స్పష్టం చేశారు. కొత్తగా వాహనాలు కూడా కొనుగోలు చేయమన్నారు. శాసనసభ భవనాలను సమర్థంగా వినియోగించుకుంటామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News