Monday, April 29, 2024

ఏడు నిమిషాల్లో క్యాన్సర్‌కు చికిత్స

- Advertisement -
- Advertisement -

ప్రపంచంలో క్యాన్సర్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నా ఇప్పుడు క్యాన్సర్ సాధారణమైంది. జీవన విధానం, ఆహారపు అలవాట్లలో మార్పులు, వాయుకాలుష్యం, వంటివి క్యాన్సర్‌కు దోహదం చేస్తున్నాయి. క్యాన్సర్ చికిత్స ఎంతో ఖర్చుతో కూడుకున్నదని చాలామంది భయపడుతుంటారు. అయితే అధునాతన వైద్యవిధానాలు అందుబాటు లోకి వచ్చి చికిత్స కాలాన్ని ఖర్చును కూడా తగ్గిస్తున్నాయి.

తాజాగా ఇంగ్లాండ్ మరో అద్భత ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. ఏడు నిమిషాల్లోనే క్యాన్సర్ చికిత్స పూర్తయ్యే ఔషధాన్ని బ్రిటన్ అందుబాటు లోకి తెస్తోంది. క్యాన్సర్ రోగికి ఇచ్చే ఇంజెక్షన్ సమయాన్ని తగ్గించే సరికొత్త ఆవిష్కరణకు బ్రిటన్ హెల్త్ సర్వీసెస్ ఆమోదం తెలిపింది. దీనివల్ల క్యాన్సర్ చికిత్స విధానంలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటాయని భావిస్తున్నారు. ప్రపంచం లోనే మొదటిసారిగా ఈ చికిత్సను ఇంగ్లాండ్ అందుబాటు లోకి తెస్తోంది. మూడొంతులు సమయం తగ్గుతుంది. క్యాన్సర్ బాధితులకు ఇమ్యునోథెరపీలో భాగంగా అటెజోలిజుమాబ్ ఇంజెక్షన్‌ను డ్రిప్ ద్వారా చర్మం కింద ఇస్తారు. ఇందుకు 30 నిమిషాల నుంచి గంట సమయం పడుతుంది.

కానీ తాజాగా ఆమోదించిన ఔషధాన్ని కేవలం 7 నిమిషాల్లోనే ఇవ్వవచ్చు. యుకె మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్‌ఆర్‌ఎ) ఏడు నిమిషాల చికిత్సకు ఆమోదం తెలిపింది. ఆగస్టు 29న 100 మంది రోగులకు ఈ చికిత్సను అందించింది. ఊపిరితిత్తులు, రొమ్ము, కాలేయం, మూత్రాశయ క్యాన్సర్ రోగులకు ఈ క్యాన్సర్ చికిత్స అందజేయనున్నట్టు ఇంగ్లాండ్ నేషనల్ హెల్త్ సర్వీస్ తెలిపింది. ఈ ఔషధం రోగులకు అనుకూలంగా ఉండడమే కాక, ఎక్కువ మందికి చికిత్స చేయడానికి వీలవుతుందని ఎంహెచ్‌ఆర్‌ఎ పేర్కొంది.

“ ప్రస్తుతం ఇంట్రావీనస్ ఇన్ఫూజన్ పద్ధతికి 30 నుంచి 60 నిమిషాల సమయం పడితే ఈ కొత్త విధానంతో సుమారు ఏడు నిమిషాల్లోనే పూర్తవుతుందని అటెజోలిజుమాబ్ ఔషధ సంస్థ రోచే ప్రాడక్ట్ మెడికల్ డైరెక్టర్ మారియన్ స్కోల్జ్ అన్నారు. అటెజోలిజుమాబ్ ఇమ్యునోథెరపీ ఔషధం క్యాన్సర్ కణాలను వెతికి, నాశనం చేయడంతోపాటు భాధితులకు రోగ నిరోధక వ్యవస్థను శక్తివంతం చేస్తుంది. ఇంగ్లాండ్‌లో ఏటా దాదాపు 3600 మంది క్యాన్సర్ రోగుల సమయాన్ని ఆదా చేసే అటెజోలిజుమాబ్ ఇంజెక్షన్‌కి మారాలని భావిస్తున్నట్టు ఎన్‌హెచ్‌ఎస్ ఇంగ్లాండ్ తెలియజేసింది. అయితే అటెజోలిజుమాబ్‌తో కలిపి ఇంట్రావీనస్ కిమో థెరపీ చేసుకునే రోగులు రక్తమార్పిడి చేయించుకునే వీలుందని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News