Sunday, April 28, 2024

మళ్లీ స్టార్‌డమ్ తెచ్చుకుంటా

- Advertisement -
- Advertisement -

Anu Emmanuel

 

కొందరు అందాల భామలకు అదృష్టం అంత సులభంగా కలిసి రాదు. స్టార్ హీరోలతో సినిమాలు చేసినా సక్సెస్‌ను అందుకోలేకపోతారు. ఇదేవిధంగా యంగ్ బ్యూటీ అను ఇమ్మాన్యుయెల్ స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్‌లతో సినిమాలు చేసినా ఆమె దశ తిరగలేదు. దీంతో కొన్నాళ్లు ఆమె సినిమాలకు దూరమైపోయింది. నిజానికి ఆమె సినిమాలకు దూరమవడానికి చాలా కారణాలే ఉన్నాయట. అందులో రెమ్యునరేషన్ సహా అనేక కారణాలున్నాయంటున్నారు. ‘చిన్న హీరోలతో చిన్న సినిమాల్లో చేయను..’ అంటూ ఆమె కొన్ని సినిమాలను తిరస్కరించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు అను ఇమ్మాన్యుయెల్ మళ్లీ తన కెరీర్‌ని జీరో నుంచి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. తమిళంలో ఓ సినిమా చేస్తోన్న ఈ బ్యూటీకి తెలుగులో రెండు ఛాన్సులు వచ్చాయట.

అందులో ఒకటి నిఖిల్ హీరోగా రూపొందుతోన్న ‘18 పేజెస్’ అని తెలిసింది. ఇది కాక మరో యంగ్ హీరో నటిస్తోన్న చిన్న సినిమాలోనూ అను ఇమ్మాన్యుయెల్ నటించనుందంటూ ప్రచారం జరుగుతోంది. కెరీర్‌లో డౌన్‌ఫాల్ వచ్చినప్పుడు ‘అహంకారం’ అస్సలేమాత్రం పనికిరాదు. కుటుంబ సమస్యల పేరు చెప్పి వెండితెరకు దూరమైపోవడం తాను చేసిన పెద్ద తప్పు అని తెలుసుకున్న ఈ బ్యూటీ అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్‌లలో మళ్లీ స్టార్‌డమ్ తెచ్చుకుంటానని చెబుతోంది. ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్‌తో ఇంట్లోనే ఉంటున్న అను ఇమ్మాన్యుయెల్ లాక్‌డౌన్ తర్వాత తన సినిమాల వివరాలను అధికారికంగా వెల్లడిస్తానని పేర్కొంది.

Anu Emmanuel prepares to start his career
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News