Thursday, May 9, 2024

కరోనాను కట్టడి చేయలేం.. కలిసి జీవించాల్సిందే: జగన్

- Advertisement -
- Advertisement -

Jagan

మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కరోనాను పూర్తి స్థాయిలో కట్టడి చేయలేని పరిస్థితి ఉందని, రాబోయే రోజుల్లో కరోనాతో కలిసి జీవించాల్సిందేనని ఎపి సిఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ సోకితే చనిపోతామని, ఇదేదో భయంకరమైన రోగమనే అపోహలు పెట్టుకోవవద్దని జగన్ అన్నారు. మున్ముందు కరోనా వైరస్ సైతం స్వైన్ ఫ్లూ తరహాలో మారిపోతుందని అన్నారు. ఇవన్నీ కూడా వైద్య సేవలతో నయమయ్యే వ్యాధులేనన్నారు. అయితే కరోనా వైరస్ పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలని, కొందరికి ఈ వ్యాధి కూడా వచ్చినట్టు తెలియదని పలు అధ్యయనాల్లో తేలిందన్నారు. కరోనాను కట్టడి చేసేందుకు అంతా అప్రమత్తంగా ఉండాలని, హాట్ జోన్‌లో 70 శాతం టెస్టు చేస్తే పాజిటివ్ రేటు 1.61శాతంగా ఉందని తెలిపారు. దేశంలో ఇది 4 శాతం ఉందని సిఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో కరోనా టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచుకున్నామని, తొమ్మది చోట్ల కరోనా టెస్టింగ్స్ జరుగుతున్నాయని ఈక్రమంలో 49 ట్రూనాట్ ల్యాబ్స్ ఏర్పాటు చేశామన్నారు. ఒక రోజులోనే 6 వేల టెస్టులు చేసే స్థాయికి వచ్చామని, దేశంలోనే అత్యధిక టెస్టులు చేస్తున్న రాష్ట్రంగా ఎపి ఖ్యాతి గడించిందన్నారు. పది లక్షల జనాభాకు దేశంలో 451 టెస్టులు జరుగుతున్న క్రమంలో రాష్ట్రంలో 1396 టెస్టు చేస్తున్నామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 74500పైగా టెస్టు చేశామని వివరించారు.
మంత్రి బోత్స, మాజీ ఎంపిల కరోనా పరీక్షలు: 
మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలకు విజయనగరంలోని వారి నివాసంలోనే వైద్యులు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. అలాగే పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్‌కి కూడా పరీక్షలు నిర్వహించారు. ముగ్గురికి కరోనా నెగటివ్‌గా వైద్యులు నిర్ధారించారు.

AP CM Jagan Press Meet on Corona

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News