Monday, April 29, 2024

ఏప్రిల్ 1కి అస్సాం టెన్త్ పరీక్షల రీషెడ్యూల్

- Advertisement -
- Advertisement -

గౌహతి: అస్సామీ పేపరు లీక్ కావడంతో ఇంగ్లీష్ (ఐఎల్) సహా ఆధునిక భారతీయ భాష (ఎంఐఎల్) సబ్జెక్టుల పరీక్షలను ఏప్రిల్1కి రీషెడ్యూల్ చేశారు. ఈమేరకు అస్సాం విద్యాశాఖ మంత్రి పెగు శుక్రవారం ప్రకటించారు. అస్సామీతోపాటు ఇతర ఎంఐఎల్ సబ్జెక్టులు బెంగాలీ, బోడో, హిందీ, మణిపురి, నేపాలీ, మిజో, ఖాసీ, గారో, కర్బీ, ఉర్దూ పరీక్షలు ఏప్రిల్‌లో నిర్వహించనున్నారు.

కర్బీ అంగ్లాంగ్, వెస్ట్ కర్బీ అంగ్లాంగ్, డిమా హసావో జిల్లాల్లో ఎంఐఎల్ అస్సామీకి బదులుగా విద్యార్థులు ఇంగ్లీష్ చదువుతారు. పరీక్షలను నిర్వహించే బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అస్సాం (ఎస్‌ఈబిఎ)పరీక్షలను మార్చి 18నుంచి ఏప్రిల్ 1కి రీషెడ్యూల్ చేసినట్లు తెలిపింది. కాగా టెన్త్ బోర్డు పరీక్షను రద్దు చేయడం, రీషెడ్యూల్ చేయడం ఇది రెండోసారి. సైన్స్ ప్రశ్నపత్రం మార్చి వి2న లీక్ కావడంతో 13న జరగాల్సిన పరీక్షను రద్దు చేశారు. సైన్స్ పరీక్షను మార్చి నిర్వహించనున్నారు. అస్సామీ పేపరు కూడా లీక్ అయిందని తెలిపిన సిఎం పరీక్షను రద్దుచేసి రీషెడ్యూల్ చేయాలని ఎస్‌ఈబిఎకు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News