Monday, April 29, 2024

థర్డ్ అంపైర్ నాటౌట్ అంటే.. ఔట్ ఇచ్చిన అంపైర్!(వీడియో)

- Advertisement -
- Advertisement -

అంపైర్ అవుటిస్తే, థర్డ్ అంపైర్ కాదనడం మామూలే. కానీ థర్డ్ అంపైర్ నాటౌట్ అంటే ఫీల్డులో ఉన్న అంపైర్ ఔట్ ఇవ్వడం మీరెప్పుడైనా చూశారా? ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మహిళల జట్ల మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో అలాంటి వింత సంఘటన చోటు చేసుకుంది.

దక్షిణాఫ్రికా బ్యాటర్ సూనె లూస్ బ్యాటింగ్ చేస్తుండగా ఆస్ట్రేలియా ఎల్బీ డబ్య్లుకి అప్పీలు చేసింది. అంపైర్ క్లైర్ పోలోసాక్ ఔట్ ఇవ్వకపోవడంతో రివ్యూ కోరింది. థర్డ్ అంపైర్ పరిశీలించి, ఔట్ కాదని తేల్చారు. అదే విషయాన్ని ఆన్ ఫీల్డ్ లో ఉన్న అంపైర్ పోలోసాక్ కి చెప్పారు. అయితే విచిత్రంగా పోలోసాక్ ‘ఔట్’ అంటూ చెయ్యెత్తారు. దాంతో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల క్రీడాకారిణులు ఆశ్చర్యపోయారు. బ్యాటర్ సూనె లూస్ కు ఏం చేయాలో పాలుపోలేదు. థర్డ్ అంపైర్ నాటౌట్ అంటే, ఫీల్డ్ అంపైర్ ఔట్ అనడంతో ఏం చేయాలో పాలుపోక క్రీజు వద్దే నిలబడిపోయింది. ఈలోగా తప్పు తెలుసుకున్న అంపైర్ పోలోసాక్ సిగ్గుపడుతూ ఔట్ కాదంటూ తన నిర్ణయాన్ని మార్చుకుంది. అంపైర్ ప్రవర్తన ఫీల్డులోనే కాదు, మ్యాచ్ ను చూస్తున్న ప్రేక్షకులకూ నవ్వు తెప్పించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News