Friday, April 26, 2024

ఈసారి అంత తేలికకాదు: సౌరవ్ గంగూలీ

- Advertisement -
- Advertisement -

Australia tour not easy to Team India: ganguly

కోల్‌కతా: గతంతో పోల్చితే ఈసారి ఆస్ట్రేలియా గడ్డపై జరిగే సిరీస్ టీమిండియాకు చాలా క్లిష్టమని భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. కరోనా నేపథ్యంలో భారత క్రికెటర్లు చాలా రోజులుగా క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి వచ్చిందన్నాడు. గతంలో ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ సాధించిన టీమిండియాకు ఈసారి గట్టి పోటీ ఖాయమన్నాడు. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌ల రాకతో ఆస్ట్రేలియా ప్రస్తుతం చాలా బలంగా మారిందన్నాడు. అంతేగాక లబూషేన్ రూపంలో మ్యాచ్ విన్నర్ బ్యాట్స్‌మన్ వారికి అందుబాటులోకి వచ్చాడన్నాడు.

ఆ సిరీస్‌లో కీలక ఆటగాళ్లు లేకుండానే ఆస్ట్రేలియా బరిలోకి దిగిందని, దీంతో భారత్ విజయం తేలికైందన్నాడు. కానీ, ఈ ఏడాది చివర్లో ఆరంభమయ్యే సిరీస్‌లో మాత్రం విజయం అంత సులువు కాదన్నాడు. అయితే స్టార్ క్రికెటర్లతో కూడిన టీమిండియాను తక్కువ అంచన వేయలేమన్నాడు. సమష్టిగా రాణిస్తే ఎంతటి పెద్ద జట్టునైనా ఓడించే సత్తా భారత్‌కు ఉందని వివరించాడు. ఓ వార్తా సంస్థ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న గంగూలీ ఈ విషయం చెప్పాడు.

Australia tour not easy to Team India: ganguly

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News