Saturday, April 27, 2024

‘పోకిరి’లో అవకాశం కోల్పోయా..

- Advertisement -
- Advertisement -

I lost 'Pokiri' movie chance says Kangana

బాలీవుడ్ స్టార్స్ పై కంగనా రనౌత్ విమర్శలు ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉంటుంది. నెపొటిజంకు వ్యతిరేకంగా ఆమె చేస్తున్న వ్యాఖ్యలు తారా స్థాయికి చేరాయి. స్టార్ వారసులపై గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన కంగనా తాజాగా పూజా భట్‌ను టార్గెట్ చేసి చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఇటీవల పూజా భట్ సోషల్ మీడియాలో కంగనాకు కౌంటర్‌గా చేసిన పోస్ట్‌కు… కంగనా మరింత సీరియస్‌గా కౌంటర్ ఇచ్చింది. ఆమెకు ‘గ్యాంగ్ స్టర్’ సినిమాలో మొదటి సినిమా ఛాన్స్ ఇచ్చిన మానాన్న మహేష్ భట్‌ను పదే పదే విమర్శిస్తుంది… అంటూ పూజా భట్ విమర్శలు చేసింది. మొదటి సినిమాకు అవార్డు అందుకున్న సమయంలో మానాన్న మహేష్ భట్‌ను కంగనా స్టేజ్ పై పొగడ్తల వర్షం కురిపించడంతో పాటు కౌగిలించుకుంది… అంటూ ఒక వీడియోను షేర్ చేసింది. అప్పుడు ప్రశంసలు కురిపించి ఇప్పుడు విమర్శలు చేయడం ఎంత వరకు సబబు అన్నట్లుగా పూజా భట్ సీరియస్ అయింది.

పూజా భట్ వ్యాఖ్యలకు కంగనా కౌంటర్ ఇచ్చింది. “మీ నాన్న వల్ల తెలుగులో ‘పోకిరి’ చిత్రంలో నటించే అవకాశం కోల్పోయాను. ‘గ్యాంగ్ స్టర్’ సినిమా చేసినా చేయకున్నా కూడా నేను ‘పోకిరి’ సినిమాతో పరిచయమయ్యేదాన్ని” అంటూ కంగనా పేర్కొంది. మొత్తానికి వీరిద్దరి మద్య సోషల్ మీడియా వార్ బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. కొందరు కంగనాకు మద్దతు పలుకుతుండగా మరికొందరు మాత్రం పూజా భట్‌కు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.

I lost ‘Pokiri’ movie chance says Kangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News