Monday, April 29, 2024

అదుపు తప్పిన కారు.. ఆటోడ్రైవర్ మృతి

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః కారు అదుపు తప్పి ఆటోను ఢీకొట్టిన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున అప్పాజంక్షన్ వద్ద చోటు చేసుకుంది. ఈ సంఘటనలో ఆటోడ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం..అప్పా జంక్షన్ వద్ద కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అవతలివైపుకు దూసుకుని వెళ్లి అటునుంచి వస్తున్న ఆటోను ఢీకొట్టింది.

దీంతో ఆటోడ్రైవర్ ఉపేందర్ అక్కడికక్కడే మృతిచెందగా, అందులో ప్రయాణిస్తున్న అరవింద్, ప్రకాష్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే పోలీసులు ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదం జరగడంతో అప్పాజంక్షన్‌లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. మితిమీరిన వేగమే రోడ్డు ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News