Monday, April 29, 2024

అలిగిన అజార్…!

- Advertisement -
- Advertisement -

పార్టీ సభ్యత్వానికి, పార్టీ పదవికి రాజీనామా చేసే యోచన ?
బుజ్జగించే బాధ్యతలను ఏఐసిసి నాయకులకు అప్పగించిన అధిష్టానం

మనతెలంగాణ/హైదరాబాద్:పార్లమెంట్ ఎన్నికల వేళ టి కాంగ్రెస్ కు కీలక నేత రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లుగా తెలిసింది. టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఇన్‌చార్జీ ఉన్న అజారుద్దీన్ కాంగ్రెస్ పార్టీకి, అతని పార్టీ పదవికి రాజీనామా చేయనున్నట్లుగా సమాచారం. కొన్ని సంవత్సరాలుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న అజారుద్దీన్ 2009లో ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీచేసి గెలుపొందారు. 2014లో రాజస్థాన్‌లోని టోంక్ ఎంపి స్థానం నుంచి పోటీ చేసి పరాజయం చెందారు.

ఆ తరువాత హెచ్‌సియూ అధ్యక్షుడిగా గెలుపొందారు. నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చివరి నిమిషంలో జూబ్లీహిల్స్ టికెట్ కేటాయించడంతో అక్కడ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయితే ఏదో ఒక కోటాలో ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆయన ఆశించారు. అయితే ఎమ్మెల్యే కోటాలోనూ, గవర్నర్ కోటాలోనూ రెండింటిలోనూ అజార్ పేరు లేకపోవడంతో ఆయన ఇక కాంగ్రెస్‌లో కొనసాగడం ఇష్టం లేక, ఆ పార్టీ సభ్యత్వానికి, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయాలన్న యోచనలో అజార్ ఉన్నట్టుగా సమాచారం. ఇప్పటికే ఈ విషయాన్ని ఏఐసిసి దృష్టికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తీసుకెళ్లడంతో ఆయన్ను బుజ్జగించే బాధ్యతలను అధిష్టానం ఏఐసిసి నాయకులకు అప్పగించినట్టుగా తెలిసింది. అయితే అజారుద్దీన్ మాత్రం తాను రాజీనామా చేయడానికే మొగ్గు చూపుతున్నట్టుగా తెలిసింది. అయితే ఆయన రాజీనామా చేస్తే ఎంఐఎంతో పాటు బిఆర్‌ఎస్ నాయకులు ఆయన్ను పార్టీలోకి చేర్చుకోవాలని ఆలోచిస్తున్నట్టుగా సమాచారం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News