Sunday, April 28, 2024

జజ్గీఖానాలో వింత శిశువు జననం

- Advertisement -
- Advertisement -
Baby born with mermaid syndrome in jejikana hospital
– రెండు గంటల్లోనే మృతి

చార్మినార్ : పాతబస్తీ పేట్లబుర్జులోని ప్రభుత్వ మోడ్రన్ ప్రసూతి ఆసుపత్రి (జజ్గీఖానా)లో అరుదైన మగశిశువు జన్మించాడు. సంగారెడ్డికి చెందిన ఆరీఫ్ భార్య తహసీన్ (20) తొలి కాన్పు కోసం ఇటీవల ఆసుపత్రిలో చేరింది. బుధవారం రాత్రి మగశిశువుకు జన్మనిచ్చింది. అయితే ఆ శిశువు పొట్టపైకి గల అవయవాలు పూర్తిగా అభివృద్ధి చెందగా, నడుము భాగం కింద గల కాళ్లు సక్రమంగా అభివృద్ధి చెందక వాటిపై పొరలాగ ఏర్పడి వింత ఆకృతిలో కనిపించాడు. దీంతో ఆసుపత్రి వైద్యులు ఆ శిశువు చికిత్సకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అయితే జన్మించిన రెండు గంటలలో ఆ శిశువు మరణించాడు. తొలి కాన్పులో జన్మించిన శిశువు వింత ఆకృతిలో జన్మించటం, ఆ తరువాత ఆ మగశిశువు కొన్ని గంటల్లోనే మరణించటం పట్ల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరైయ్యారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News