Thursday, May 16, 2024

12 మిలియన్ వ్యూస్‌తో ట్రెండింగ్‌లో…

- Advertisement -
- Advertisement -

 

సీనియర్ స్టార్ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలయ్య, బోయపాటి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఈ సినిమాపై బాలయ్యతో పాటు ఆయన అభిమానులు కూడా ఎంతో నమ్మకంగా ఉన్నారు. దీనికి తగ్గట్టే బాలకృష్ణ బర్త్ డే కానుకగా ఫస్ట్ రోర్ పేరుతో విడుదల చేసిన ఫస్ట్ లుక్ టీజర్ విశేష ఆదరణ దక్కించుకుంది. ఇందులో పంచెకట్టులో మీసాన్ని మెలితిప్పుతూ మాస్ లుక్‌లో బాలయ్య అదరగొట్టాడు. ఈ సినిమాలో ఈ సీనియర్ స్టార్ రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తుండగా… అందులో ఒకటి అఘోర పాత్ర అని సమాచారం. ఇటీవల రిలీజైన టీజర్‌లో కనిపిస్తుంది మరో పాత్ర అని తెలిసింది. ఇక ‘బిబి3’ టీజర్ ఇప్పటి వరకు 12 మిలియన్స్ వ్యూస్ సొంతం చేసుకొని ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. అంతేకాకుండా ఈ టీజర్ నందమూరి అభిమానులనే కాకుండా సాధారణ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది. అందులోనూ వీడియో చూస్తుంటే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. ఇక బోయపాటి వన్ వీక్ షెడ్యూల్‌లోనే ఈ రేంజ్‌లో భీభత్సం సృష్టిస్తే ఇక సినిమా మొత్తం ఎలా ఉండబోతుందో అని బాలయ్య,- బోయపాటి అభిమానులు అంచనాలను పెంచేసుకుంటున్నారు. బాలకృష్ణ, బోయపాటి శ్రీను ఇద్దరూ ఈ సినిమాతో మరో హిట్ కొడతారని అభిమానులు ఆశిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News