Wednesday, May 1, 2024

డ్రాగన్ కోరల్లో నిలువెల్లా విషం

- Advertisement -
- Advertisement -

China occupy india land at boarders

ప్రపంచ చరిత్రలో భారత్, చైనాల మధ్య ఘర్షణలు 1914లోనే రాజుకున్నాయి. చైనా రిపబ్లిక్, బ్రిటన్, టిబెట్‌ల మధ్య సిమ్లాలో జరిగి సమావేశం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. టిబెట్‌కు స్వయం ప్రతిపత్తి ఇవ్వడాన్న చైనా వ్యతిరేకించింది. కాని బ్రిటన్ టిబెట్‌ల మధ్య 550 మైళ్ల ‘మ్యాక్ మోహన్ లైన్’ ఏర్పాటుకు అంగీకారం కుదిరింది. 1947లో భారతదేశం స్వాతంత్య్రం పొందిన తరువాత చైనా సరిహద్దు వివాదాలు క్రమంగా పెరుగుతున్న వచ్చాయి. టిబెట్ సరిహద్దు అంగీకారాన్ని వ్యతిరేకించిన చైనాతో భారత్ పలు సందర్భాలలో ఇబ్బంది పడుతూనే ఉంది. 1962లో ఇండో- చైనా యుద్ధంలో మ్యాక్ మోహన్ లైన్ దాటి చైనా బలగాలు భారత భూభాగాన్ని ఆక్రమించాయి. నెల రోజులు జరిగిన ఈ యుద్ధంలో 1,000 భారత సైనికులు వీర మరణం పొందగా, 3,000 మంది సైనికులను ఖైదీలుగా చైనా బంధించుట జరిగింది.

సరిహద్దు హిమగిరుల్లో రుధిర ధారలు పారాయి. చైనా దుర్మార్గపు దుశ్చర్యకు 20 మంది భారత వీర జవాన్లు అమరత్వం పొందడం యావత్ భారత హృదయాన్ని కలిచి వేసింది. వీరిలో కొంత మంది సైనికులు లోయలోకి జారి నదిలో పడడం వలన, మరి కొంత మంది చైనా దాడిలో మరణించటం జరిగింది. మూక దాడికి పాల్పడిన చైనా మూర్ఖ సైనికులు 40 దాకా మరణించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. చాలా ఏళ్ల తరువాత ఇలాంటి పెద్ద ఘర్షణ జరగడం ఇదే మెుదటిసారి. తరుచుగా ఇరుదేశాల జనరల్ స్థాయి అధికారుల చర్చలు శాంతియుతంగా జరుగుతూనే ఉన్నాయి.

ఇటీవలే కేంద్రపాలిత ప్రాంతంగా అవతరించిన లడక్‌లో ఊహించని లడాయికి జాతి యావత్తు ఉడికిపోయింది. లడఖ్ ప్రాంత గల్వాన్ లోయలోని చైనా సరిహద్దులో ఆయుధ రహిత గస్తీ తిరుగుతున్న భారత సైనికులపై ప్రణాళికాబద్ధంగా చైనా సేనలు కక్ష నింపుకున్న ఇనుప రాడ్లు, రాళ్లు, కర్రలతో భారత సైనికులపై ఆకస్మిక దాడి చేయడం చైనా కుటిల నీతికి నిలువెత్తు సాక్షమని నమ్మాల్సిందే. ఈ ఘర్షణలో తెలంగాణ తెలుగు తేజం కల్నల్ సంతోష్ బాబు అమరుడు కావడం విచారకరం. శతాబ్దాలుగా సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖను చెరుపుతూ, భారత భూభాగాన్ని ఆక్రమించాలనే ఛండాలపు ఆలోచన చైనాది. కరోనా కల్లోలానికి కారణమై అప్రతిష్ఠను మూట కట్టుకొన్న చైనా దోషిలా అంతర్జాతీయ వేదిక ముందు నిస్సహాయంగా నిలబడింది.
ఒక తప్పును కప్పుకొనుటకు, ప్రపంచ దృష్టి మరల్చుటకు, చైనా మరో తప్పు చేస్తున్న ఘర్షణ తీరిది. మానవ నివాసానికి అనుకూలించని సముద్ర మట్టానికి 14,000 అడుగు ఎత్తైన మంచు కొండల్లో గిల్లికజ్జాలు పెట్టుకుంటూ, భారత్‌ను ఇబ్బంది పెడుతూ తన వైపుకు లాక్కోవాలనే దురాలోచన చైనాది. ఇండో -చైనా 2,100 మైళ్ల సరిహద్దులలో రెండు దేశాల సైనికులు గస్తీ తిరుగుతూ ముఖాముఖీగా ఎదురైన సందర్భాలు అనేకం ఉన్నాయి. లడఖ్ ప్రాంతంలోని వాస్తవాధీన రేఖ వెంట ఇటీవల భారత్ నిర్మించిన రోడ్డు విషయాన్ని జీర్ణించుకోని చైనా ఈ దుశ్చర్యకు పాల్పడిందని భావిస్తున్నారు. దీనికి జవాబుగా చైనా కూడా సరిహద్దు ప్రాంతాలలో నిర్మాణాలు చేపట్టడంతో రెండు వర్గాలు నేరుగా తలపడే స్థాయికి చేరాయి.

ప్రపంచ చరిత్రలో భారత్, చైనాల మధ్య ఘర్షణలు 1914లోనే రాజుకున్నాయి. చైనా రిపబ్లిక్, బ్రిటన్, టిబెట్‌ల మధ్య సిమ్లాలో జరిగి సమావేశం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. టిబెట్‌కు స్వయం ప్రతిపత్తి ఇవ్వడాన్న చైనా వ్యతిరేకించింది. కాని బ్రిటన్ టిబెట్‌ల మధ్య 550 మైళ్ల ‘మ్యాక్ మోహన్ లైన్’ ఏర్పాటుకు అంగీకారం కుదిరింది. 1947లో భారతదేశం స్వాతంత్య్రం పొందిన తరువాత చైనా సరిహద్దు వివాదాలు క్రమంగా పెరుగుతున్న వచ్చాయి. టిబెట్ సరిహద్దు అంగీకారాన్ని వ్యతిరేకించిన చైనాతో భారత్ పలు సందర్భాలలో ఇబ్బంది పడుతూనే ఉంది.
1962లో ఇండో- చైనా యుద్ధంలో మ్యాక్ మోహన్ లైన్ దాటి చైనా బలగాలు భారత భూభాగాన్ని ఆక్రమించాయి. నెల రోజులు జరిగిన ఈ యుద్ధంలో 1,000 భారత సైనికులు వీర మరణం పొందగా, 3,000 మంది సైనికులను ఖైదీలుగా చైనా బంధించుట జరిగింది. ఈ యుద్ధంలో 800 చైనా సైనికులు మాత్రమే ప్రాణా లు కోల్పోయారు. ఈ యుద్ధంలో ఓటమితో భారత్ తన భూభాగాన్ని కోల్పోవడం జరిగిన పిదప వాస్తవాధీనరేఖ నిర్ణయించబడింది. సిమ్లాను కలిపే ‘నాథూ లా’, ‘ఛో లా’ మార్గాన కంచె నిర్మిస్తున్న భారత్‌ను 1967లో ఎదురిస్తూ చైనా ఘర్షణలకు దిగింది. ఈ ఘర్షణలో 150 మంది భారత సైనికులు, 340 మంది చైనా సైనికులు మరణించారు.

ఈ ఘర్షణను ఇండో, -చైనా రెండవ యుద్ధంగా వర్ణించారు. ఇండియా 1975లో రష్యా సైనిక ఒప్పందంతో చైనాను కట్టడి చేసి సిమ్లాకు విలీనం చేసుకుంది. 1987లో భారత్ సరిహద్దు ప్రాంతంలో మిలిటరీ శిక్షణలో భాగంగా నిర్వహించిన్ మాక్ ఆపరేషన్‌కు ఆశ్చర్యపడిన చైనా తన సైనిక బలగాలను సరిహద్దులలో మోహరించింది. 2013లో ‘దౌలత్ బెగ్ ఓల్డీ’ సరిహద్దు ప్రాంతంలో చైనా సైనికులు క్యాంప్ వేయగా, సమాధానంగా దానికి 1,000 అడుగుల దూరంలోనే భారత్ కూడా సైనిక శిబిరాన్ని ఏర్పాటు చేసి దీటైన జవాబిచ్చింది. తరువాత చర్చల్లో ఈ శిబిరాలను తొలగించాలని రెండు దేశాలు అంగీకరించాయి. 2017లో చైనా డోక్లాం ప్రాంతంలో నిర్మించిన రోడ్డును దేశ భద్రత దృష్ట్యా భారత్ వ్యతిరేకించింది.
భారత్‌ను అస్థిర పరుచుటకు చైనా వేయని కుయుక్తి లేదు, చేయని దుర్మార్గం లేదు. భారత్‌కు ఇరుగు పొరుగు దేశాలకు మధ్య అంతరాలు పెంచి పోషించటానికి చైనా పలు దేశాలకు ఆర్థిక సహా యం చేస్తున్నది. పాకిస్థాన్‌కు అణ్వాయుధాలు, రక్షణ రంగంలో చేయూతను ఇస్తూ భారత్‌పై ఎగదోస్తున్నది. నేపాల్‌కు సహాయం చేస్తానంటూ కాలాపాని వివాదానికి తెరలేపే ప్రయత్నాలు చేస్తున్నది. శ్రీలంక లాంటి పొరుగు దేశాలను భారత్‌కు వ్యతిరేకంగా నిలబడాలంటూ బెదిరిస్తున్నది. చైనా సరిహద్దులు పంచుకునే చిన్న దేశాలైన కజకిస్థాన్, కిర్గికిస్థాన్, బర్మా, ఉజ్జెకిస్థాన్‌లకు అండగా ఉంటానని నమ్మించి దోపిడీ చేస్తున్నది. అవినీతి ఆలోచనలతో పలు దేశాల సంపదలను స్వాహా చేసే నేర్పరిగా చైనా రాటుదేలి పోయింది. కమ్యూనిజానికి చిరునామాగా పేరున్న చైనా ప్రస్తుతం సామ్రాజ్యవాద దేశంగా అవతరించి ప్రపంచాన్ని జయించే ఆధిపత్యదేశంగా ఎదిగే ప్రయత్నాలు చేస్తున్నది.
భారత భూభాగంలో పశ్చిమ హిమాలయాల్లోని 38,000 చెదరపు కిలోమీటర్లు, తూర్పున 90,000 చదరపు కిలోమీటర్లు తమదేనని, వాస్తవాధీన రేఖ దాటుతూ భారత భూభాగాన్ని ఆక్రమించే ప్రయత్నాలు చైనా చేస్తూనే ఉంది. 780 కోట్ల ప్రపంచ జనాభాలో 144 కోట్ల చైనా, 138 కోట్ల ఇండియా జనాభా ఉన్నది. ప్రపంచ జనాభాలో ఈ రెండు దేశాల జనాభా 36.2 శాతంగా ప్రముఖ దేశాలుగా నిలబడ్డాయి. రెండు దేశాలు అణ్వాయుధ సంపత్తిని కలిగినవే. ఆధిపత్యం కోసం రెండు దేశాలు సరిహద్దులలో రోడ్లు, ఎయిర్‌స్ట్రిప్‌లు, అవుట్ పోస్టులు, టెలీఫోన్ లైన్‌లు లాంటి మౌలిక వసతులు కల్పించుకుంటూనే ఉన్నాయి. ఎవరి భూ భాగాలు వారు రక్షించుకోవలసిందే. మరొకరి భూభాగాన్ని ఆశించడం దుర్మార్గం. అభివృద్ధితో ఆధిపత్యాన్ని సాధించాలి.
దురాశ దుఃఖానికి చేటు కారాదు. నేటి ఆధునిక యుగంలో యుద్ధమే జరిగితే ప్రపంచ మానవాళి మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. దేశ భూ వైశాల్యానికి బదులు దేశ మనోవైశాల్యం పెరగాలి. భవిష్యత్ యుద్ధాలు సైనికుల మధ్య కాదు, జాతీయతా భావాలు గల రెండు దేశాల జనుల మనోభావాల మధ్యనే జరుగుతాయని మరువరాదు. విభేదాలను శాంతియుతంగా పరిష్కరించుకుంటూ, విశ్వశాంతికి పునాదులు వేసుకున్నపుడే మానవ జాతి సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. ఆయుధాలను వీడి సదాలోచనలు చేద్దాం. ఆవేశాలకు స్వస్థి పలికి, అభివృద్ధి బాట పడదాం. పశుత్వాన్ని వీడి మానవత్వాన్ని పోషిద్దాం. రాజకీయాలకు అతీతంగా దేశమంతటా ఒక్కతాటిపై నిలిచి, భారత సార్వభౌమాధికారాన్ని భగ్నం చేయదలచిన దేశాలకు సరైన జవాబు చెప్పాల్సిందే. జై భారత్ జై జవాన్. కల్నల్ సంతోష్ అమర్ రహే.

బి.మధుసూదన్ రెడ్డి
– 9949700037

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News