Monday, May 6, 2024

గోన గన్నారెడ్డిగా బాలయ్య

- Advertisement -
- Advertisement -

Balayya role as Gona Ganna Reddy

 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఎన్నో సినిమాల్లో కనిపించాడు. అయితే చాలా మట్టుకు స్టైలిష్‌గా, మాస్ లుక్స్‌లో కనిపించిన బన్నీ కెరీర్‌లో ఒక ఐకానిక్ రోల్ ఏదన్నా ఉంది అంటే అది గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘రుద్రమదేవి’లోని గోన గన్నారెడ్డి పాత్రే అని చెప్పాలి. ఈ పీరియాడిక్ చిత్రంలో అల్లు అర్జున్ చేసిన ఈ పాత్రకు గాను మంచి ప్రశంసలు దక్కాయి. అయితే నందమూరి బాలకృష్ణ ఈ పాత్రలో నటించాలని అనుకుంటున్నట్టుగా సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే బాలయ్య ఒక టీమ్‌ను ఈ రోల్‌పై రీసెర్చ్ చేసేందుకు కూడా నియమించాడని తెలిసింది. మరి ఈ సీనియర్ స్టార్‌కు అంతలా నచ్చిన ఈ రోల్ ను కనుక పోషిస్తే ఎలా ఉంటుందో? అన్నది ఆసక్తికరంగా మారింది. మరి ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News