Saturday, April 27, 2024

ప్రకృతి పచ్చని వనంలా మారుతుంది

- Advertisement -
- Advertisement -

Balka Suman who planted the plants

 

గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన బాల్కసుమన్, బండాప్రకాష్

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ విప్, శాసనసభ్యుడు బాల్కసుమన్ పుట్టిన రోజు సందర్భంగా రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ శుభాకాంక్షలు తెలుపుతూ మంచి ఆరోగ్య, శాంతితో సుదీర్ఘకాలం ప్రజాసేవలో నిమగ్నం కావాలని ఆశీస్సులు అందించారు. అయితే పుట్టినరోజు పురష్కరించుకుని గ్రీన్‌ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటాలని సంతోష్‌కుమార్ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి బాల్కసుమన్ మొక్కలు నాటారు. ఎంపి బండాప్రకాష్ పుట్టిన రోజు సందర్భంగా సంతోష్‌కుమార్ శుభాకాంక్షలు తెలుపుతూ మొక్కలు నాటాలని ఇచ్చిన సవాల్‌ను స్వీకరించి తన నివాసంలో మొక్కలు నాటారు. ఎంపి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొని మూడుమొక్కలనుటాలని కోరారు.

మనం ఫౌండేషన్ నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఐదవ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా యాప్రాల్‌లోని మనం ఫౌండేషన్‌లో ఆర్‌ఎస్ కుమార్ మొక్కలు నాటారు. టిఆర్‌ఎస్‌వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ విసిరిన గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి ఉస్మానియా విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యుడు పెర్కశ్యామ్ మొక్కలు నాటారు. గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌తో ప్రకృతి పచ్చని వనంలా మారిపోతుందన్నారు. అనంతం ఓయు ఇంఛార్జీ విసి, ఎంఎయుడి డైరెక్టర్ రవింద్ కుమార్, దర్శకుడు సంపత్ నంది,టిఎస్‌పిఎస్‌సి చైర్మన్ గంట చక్రపాణి మొక్కలునాటాలని పెర్కశ్యామ్ గ్రీన్‌ఇండియా ఛాలెంజ్ ఇచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News