Monday, May 6, 2024

తైవాన్‌పై యుద్ధానికి సిద్ధమవుతోన్న చైనా..

- Advertisement -
- Advertisement -

తైవాన్‌పై యుద్ధానికి సిద్ధమవుతోన్న చైనా
కీలక ప్రాంతాలకు క్షిపణులు, బలగాల తరలింపు
ధ్రువీకరించిన ఉపగ్రహ చిత్రాలు

బీజింగ్: తైవాన్‌పై చైనా యుద్ధానికి సిద్ధమవుతున్నట్టుగా రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సౌత్‌చైనా మార్నింగ్ పోస్ట్‌లో వచ్చిన కథనం ప్రకారం చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పిఎల్‌ఎచైనా ఆర్మీ) ఆగ్నేయ తీరంలో తన బలగాలను విస్తరిస్తోంది. ఆ ప్రాంతంలో గతంలో మోహరించిన డిఎఫ్11, డిఎఫ్15 క్షిపణుల స్థానంలో హైపర్‌సోనిక్ డిఎఫ్17 క్షిపణులను మోహరిస్తోంది. ఈ నూతన క్షిపణులు లక్షాలను కచ్చితంగా ఛేదించడంలో ఉన్నత శ్రేణివిగా చెబుతున్నారు. మరోవైపు ఫుజియాన్, గ్వాంగ్డాంగ్ స్థావరాల్లో చైనా తన మెరైన్ కార్ప్, రాకెట్ ఫోర్స్‌ను విస్తరిస్తోందని కెనడా కేంద్రంగా పని చేస్తున్న కన్వా డిఫెన్స్ రివ్యూ వెల్లడించింది. ఉపగ్రహ చిత్రాలను ఆధారంగా చూపింది. ఈ స్థావరాలు పూర్తిస్థాయిలో యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. మంగళవారం గ్వాంగ్డాంగ్‌ను సందర్శించిన సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ యుద్ధానికి సిద్ధం కావాలని దళాలకు సూచించడాన్ని కూడా రక్షణ నిపుణులు పేర్కొంటున్నారు.

ఇటీవల(ఈ ఏడాది సెప్టెంబర్ 18,19 తేదీల్లో) తైవాన్ సరిహద్దులో చైనా సైనిక విన్యాసాలు కూడా నిర్వహించింది. ఆ సందర్భంగా చైనాకు చెందిన 40 యుద్ధ విమానాలు సరిహద్దును దాటి తైవాన్‌లోకి ప్రవేశించాయి. దానిపై స్పందించిన తైవాన్ అధ్యక్షురాలు సాయి ఇంగ్‌వెన్ తమను బెదిరించే లక్షంతోనే ఆ ప్రదర్శన అని వ్యాఖ్యానించారు. తైవాన్‌ను తమ దేశ అంతర్గత ప్రాంతంగా చైనా పలుమార్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే, అందుకు తైవాన్ పాలకులు అంగీకరించడంలేదు. తైవాన్ స్వతంత్ర దేశంగా మనగలిగేందుకు అమెరికా మద్దతు తెలుపుతూ వస్తోంది. ప్రస్తుతం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల హడావుడి నెలకొన్న నేపథ్యంలో తైవాన్‌ను తన ఆధీనంలోకి తీసుకునేందుకు చైనా సాహసం చేస్తుందా అన్నది కొన్ని రోజుల్లో తేలిపోనున్నది.

China forces to Prepare for war on Taiwan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News