Monday, April 29, 2024

వేసవిలో ఇంటికి నూతన అందం

- Advertisement -
- Advertisement -

Beauty for houses with Interior Design

వేసవి 2022 తనతో పాటుగా సానుకూలత, నూతన ప్రారంభాలనూ తీసుకువస్తుంది. కోవిడ్‌–19 నిబంధనలు నెమ్మదిగా సడలిస్తున్నారు. ఈ వేసవి, మీరు మీ ఇంటికి నూతన అందాలను అందించేందుకు అత్యుత్తమ సమయం. మరీ ముఖ్యంగా రెండు సంవత్సరాలు మహమ్మారి కాలంలోనే గడిచిపోయిన ఏళ, మన ఇంటిని మరింత ఆహ్లాదంగా మార్చడంతో పాటుగా నూతన హైబ్రిడ్‌ పని సంస్కృతిలో మరింత అనుకూలంగా, మన అవసరాలకు తగినట్లుగా మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అందువల్ల మనం హోమ్‌ రెనోవేషన్‌ ప్రాజెక్టులను ఈ వేసవిలో చేపట్టవలసి ఉంది. ఇంకెందుకు, ఈ రెనోవేషన్‌ ప్రారంభించండి. విశ్రాంతిగా కూర్చోండి. చికాకు పుట్టించే వాన, చలి సమయంలో ఇంటి నుంచే ఆనందించండి.

డిజైన్లు, పెయింట్లు, మరీ ముఖ్యంగా సీలింగ్స్‌ దగ్గరకు వచ్చేసరికి భారీ మొత్తంలో మార్పులకు లోనవుతున్నాయి. డెకార్‌ పరంగా 5వ గోడను మనం సాధారణంగా పట్టించుకోము. నేడు, విస్తృత శ్రేణిలో ఆకృతులు డిజైనర్‌ సీలింగ్స్‌ పరంగా కనిపిస్తున్నాయి. హాల్‌, బెడ్‌రూమ్‌ సీలింగ్‌ పరంగా ఇది మరింత ఎక్కువగా కనిపిస్తుంది. సీలింగ్‌ను విభిన్న రకాల మెటీరియల్స్‌తో తయారుచేస్తున్నారు. కానీ వీటిలో జిప్సం అత్యంత ప్రాచుర్యం పొందింది. కనీస నిర్వహణ, ధూళి రహిత స్వభావం దీనికి కారణంగా నిలుస్తుంది.

సీలింగ్‌, అత్యవసరమైన 5వ గోడ: చాలా వరకూ సందర్భాలలో, సీలింగ్స్‌ను నిర్లక్ష్యం చేస్తుంటారు. ఏదైనా ఇంటీరియర్‌ స్పేస్‌ను అలంకరించడం లేదా పునః అలంకరించడం చేయాలనుకుంటే సాఽధారణంగా గోడలు, ఫ్లోర్స్‌ మీద అధికంగా శ్రద్ధ చూపుతుంటారు. మీ అభిరుచులకు తగినట్లుగా అంశాలను మార్చాల్సిన అవసరం ఉన్నప్పటికీ, సీలింగ్స్‌ సైతం మీ ఇంటిలోని వాతావరణాన్ని ఆహ్లాదీకరించడంలో అతి కీలకమైన పాత్రను పోషిస్తాయి. ప్రత్యేకమైన, సున్నితమైన, అద్వితీయ అందం మీ ఇంటికి లభించాలంటే సీలింగ్‌ చక్కటి తోడ్పాటునూ అందిస్తుంది. తమ ఇంటి ఐదవ గోడకు సౌందర్యం అందించేందుకు చాలా మంది డిజైనర్‌ కృత్రిమ సీలింగ్స్‌ను ఎంచుకుంటుంటారు. ఎలాంటి ఇంటీరియర్‌కు అయినా చూపుల పరంగా గణనీయమైన ప్రభావాన్ని అవి చూపుతాయి. ప్రస్తుతం, బిల్డర్లు, రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లు మరియు ఆఖరకు ఆర్కిటెక్ట్‌లు డిజైన్‌ ప్రక్రియ ఆరంభం నుంచి డిజైన్డ్‌ ఫాల్స్‌ సీలింగ్స్‌ వినియోగాన్ని నొక్కి చెబుతున్నారు.

సీలింగ్‌ మిత్రుడు : ఓ ఇంటి యజమానిగా, గణనీయంగా మీ ఇంటీరియర్స్‌కు పునః రూపకల్పన చేయడమన్నది అత్యంత ఖర్చుతో కూడిన అంశంగా కనిపించవచ్చు. అయితే, పని పూర్తిచేయడానికి, మీ ఇంటి సీలింగ్‌ పునః రూపకల్పన చేయడానికి మీ బ్యాంక్‌లో నిల్వ చేసిన నగదును మొత్తం ఖాళీ చేయాల్సిన అవసరం లేదు.అయితే, మీ పునరుద్ధరణ ప్రాజెక్ట్‌లో నమ్మకమైన భాగస్వామి అవసరం ఉంది. సెయింట్‌ గోబైన్‌ జిప్రోక్‌ దీని కోసం మీ భావోద్వేగాలు, బడ్జెట్‌ మరియు గడువు తేదీలను అందుకునే రీతిలో సమగ్రమైన క్యాటలాగ్స్‌ను అభివృద్ధి చేసింది. కేవలం ఏడు రోజులలో మీ సీలింగ్‌కు నూతన అందాన్ని ఇవి అందించనున్నాయి. జిప్సం సీలింగ్‌ ఖర్చు కేవలం ఒక అంశం మీద మాత్రమే కాదు నాలుగు అంశాలపై ఆధారపడి ఉంటుంది. అవి, డిజైన్‌ అవకాశాలు, ఇన్‌స్టాలేషన్‌ ఖర్చు, రవాణా, కూలీ ఖర్చులు. ఈ అంశాలన్నీ గుణించిన తరువాత, ఈ ఖర్చు సాధారణంగా చదరపు అడుగుకు 100–140 రూపాయల నడుమ ఉంటుందని భావించవచ్చు. అయితే, ఇదంతా కూడా మీరు సంప్రదించిన ఇంటీరియర్‌ డిజైనర్ల పై ఆధారపడి ఉంటుంది. మీ లివింగ్‌ స్పేస్‌కు సంబంధించి అత్యుత్తమ డిజైన్‌ ఎంచుకునేందుకు తగిన మార్గనిర్దేశకత్వం కూడా జిప్రోక్‌ మీకు చేస్తుంది. ఇదంతా కూడా సహేతుకమైన, అందుబాటు ధరలలోనే అందిస్తుంది. ఈ ఫలితంగానే, సీలింగ్స్‌ దగ్గరకు వచ్చేసరికి మీకు అత్యంత నమ్మకమైన మిత్రునిగా జిప్రోక్‌ నిలుస్తుంది.

సౌందర్యానికి అతీతంగా: జిప్సం బోర్డులను వినియోగించి సీలింగ్స్‌ డిజైనింగ్‌ దగ్గరకు వచ్చేసరికి, మీకు ఎంచుకునేందుకు ఎన్నో ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. మీ సీలింగ్స్‌ కోసం విభిన్న ఆకృతులతో మీరు ప్రయోగాలు చేయడం మాత్రమే కాదు, మీ లివింగ్‌ స్పేస్‌కు నాటకీయతనూ జోడించవచ్చు. ఆకర్షణీయమైన ఫినీష్‌ను అందించడం ద్వారా మీ ప్రోపర్టీ యొక్క అందం ఇది మెరుగుపరుస్తుంది. డిజైనర్‌ సీలింగ్స్‌తో సౌందర్యం మెరుగుపడటమే కాదు, పలు ప్రయోజనాలు సైతం ఇవి అందిస్తాయి. మీరు ఎయిర్‌ కండీషనర్‌ వినియోగించే అవసరాన్ని గణనీయంగా తగ్గించడం ద్వారా వేసవిలో విద్యుత్‌బిల్లులను సైతం తగ్గిస్తాయి. ఉదాహరణకు మీ గది 12 X 12 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉందనుకుందాం. మీ ఫాల్స్‌ సీలింగ్‌, వాస్తవ సీలింగ్‌కు ఒక అడుగు కిందకు ఉంటుంది. దీనివల్ల 12 X 12 X 1 క్యూబిక్‌ స్పేస్‌ను తగ్గిస్తుంది. లేదంటే మీ ఏసీ ఆ ప్రాంతాన్ని కూడా చల్లబరచవలసి వస్తుంది. విద్యుత్‌ పరంగా ఇది ఆదా అవుతుంది. ఇతర ప్రయోజనాలలో సమానంగా కాంతి పంపిణీ, గజిబిజిగా ఉన్న వైర్లు, పైపులు దాయబడటం, ఫాల్స్‌ సీలింగ్‌ సహాయంతో గదుల నేపథ్యం/మూడ్‌ను అవసరాలకు తగినట్లుగా మార్చుకోవడం వంటివి ఉన్నాయి. ఈ వ్యాపారంలో సుప్రసిద్ధమైనది జిప్రోక్‌. ఇది వాల్‌ డెకార్‌, ఫాల్స్‌ సీలింగ్స్‌కోసం విస్తృతశ్రేణిలో అవకాశాలను అందిస్తుంది.

ఈ ఫాల్స్‌ సీలింగ్స్‌ అతి తేలికగా ఉండటంతో పాటుగా మన్నికైన మెటీరియల్స్‌ అయినటువంటి జిప్సం లాంటి వాటితో తీర్చిదిద్దడం జరుగుతుంది. ఇవి కనీసం రెండు దశాబ్దాల పాటు సాధారణ వినియోగానికి అనుకూలంగా ఉండటంతో పాటుగా సులభంగా ఇన్‌స్టాల్‌ చేసుకోవడమూ వీలవుతుంది మరియు విభిన్నమైన డిజైన్లలో ఇవి లభిస్తాయి. నూతన జీవనశైలికి మార్గం వేయబోతున్నాం. ఆరోగ్యవంతంగా, సురక్షితంగా మనం ఉన్నామన్న భావన కలగాలంటే మన పర్యావరణం ఎప్పుడూ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. దాదాపుగా మూడేళ్లగా అనిశ్చితలోనే మనం గడుపుతున్నాం. నూతన ఆరంభానికి ప్రతీకగా మన ఇంటినీ మార్చుకోవాల్సి ఉంది. డెకార్‌లో సరైన మార్పులు చేయడం ద్వారా దీనికి సరైన సమాధానం చెప్పగలం. అందువల్ల, ఈ శీఘ్ర పరిష్కారాన్ని అమలు చేయండి, మీ ఇంటిని వేసవికి సిద్ధం చేయడంతో పాటుగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భవిష్యత్‌ను స్వాగతించండి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News