Wednesday, May 1, 2024

‘కర్ణన్’ రీమేక్‌లో…

- Advertisement -
- Advertisement -

Bellamkonda Srinivas

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమిళ హిట్ ‘కర్ణన్’ మూవీ తెలుగు రీమేక్‌లో నటించనున్నాడు. తమిళంలో ధనుష్ నటించిన ‘కర్ణన్’ చిత్రాన్ని మారి సెల్వరాజ్ డైరెక్ట్ చేశారు. తమిళనాడులో ఇటీవల ఈ చిత్రం విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటుగా భారీ వసూళ్లు సాధించింది. ధనుష్ యాక్షన్ ప్యాక్డ్ మూవీగా తెరకెక్కిన ‘కర్ణన్’ సినిమా కథ నచ్చడంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ మూవీ తెలుగు రీమేక్‌లో నటించాలని నిర్ణయించుకున్నాడు.

ఈ రీమేక్ మూవీ దర్శకుడు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు. ఇక ప్రభాస్ కెరీర్ రేంజ్‌ని నెక్స్ లెవల్‌కు తీసుకువెళ్లిన ‘ఛత్రపతి’ సినిమా హిందీ రీమేక్‌తో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీనిస్తున్నారు. పెన్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకులు వి.వి.వినాయక్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ ఇప్పటికే మొదలు కావాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా వేశారు. ఈ సినిమా చిత్రీకరణ కోసం మేకర్స్ ఇప్పటికే హైదరాబాద్‌లో భారీ సెట్ వేశారు. ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసిన తర్వాత ధనుష్ ‘కర్ణన్’ తెలుగు రీమేక్ వర్క్‌ను మొదలు పెట్టనున్నాడు యంగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News