Monday, April 29, 2024

బెట్టింగ్ @ రూ.10 వేల కోట్లు..

- Advertisement -
- Advertisement -

కాయ్ రాజా కాయ్..

హైదరాబాద్ : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దేశ వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల పైన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకమైన ఆసక్తి కనిపిస్తుంది. తెలంగాణ ఎన్నికలపై బెట్టింగ్ దందా జోరుగా కొనసాగుతోంది. ఇప్పటికే రూ. 2,500 కోట్లకుపైగా దందా సాగినట్లు సమాచారం. గురువారం సాయంత్రం విడుదలయ్యే ఎగ్జిట్ పోల్స్ నుంచి ఫలితాలు వెలువడే డిసెంబర్ 3వ తేదీ వరకు బెట్టింగ్ దందా రూ.10 వేల కోట్ల రూపాయలు దాటినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయాలు సర్వత్రా వినవస్తున్నాయి. నెల క్రితమే ఎపిలోని పలు ప్రాంతాల్లో తెలంగాణ ఎన్నికలపై బెట్టింగులు సాగుతున్నాయని రూ.వెయ్యికోట్ల దందా జరిగినట్లు అప్పట్లో వార్తలు వినిపిం చాయి. విజయవాడ, విశాఖపట్నం, ఎపిలోని పలు జిల్లాలతో సహ ముంబై, ఢిల్లీ, కోల్‌కతాతో పాటు దేశంలోని పలు ఇతర నగరాల నుంచి ఇది జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సారి పలానా పార్టీ అధికారంలోకి రాబోతోం దని, పలానా నియోజకవర్గంలో పలానా అభ్యర్థి గెలవబోతు న్నారంటూ భారీగా పందాలు వేస్తున్నారు.

వందకు వెయ్యి, వెయ్యికి లక్ష అంటూ బెట్టింగ్ బంగార్రాజులు పందేలు కాస్తున్నారు. పెద్ద లీడర్లు తలపడుతున్న నియోజకవర్గాల్లో ఎవరికి ఎంత మెజార్టీ వస్తుందన్న దానిపై పందేలు కూడా కాస్తున్నారు. లక్షలు కాదు కోట్లలో బెట్టింగ్స్ జరుగు తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో ఏ పార్టీ గెలుస్తుంది? ఎవరు అధికారంలోకి రాబోతున్నారు. రాష్ట్రంలో ఎవరిని చూసినా ఇదే చర్చ. ఊరు వాడా, పల్లె పట్నం అని తేడా లేకుండా ప్రతి గల్లిలోనూ ఏ నలుగురు గుమిగూడినా ఇదే చర్చ. డిసెంబరు 3వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయని.. పందెంలో గెలిచిన వారు అంతకంత డబ్బు సంపాదించు కోవచ్చని ఊరిస్తున్నాయి. ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నిత్యం రకరకాల ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే బెట్టింగ్ సంస్థలు అంతకు మించి హడావుడి పెంచాయి. తెలంగాణలోనే కాదు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో సర్వేలు చేయించి మరీ పందాలు కాస్తున్నారు బుకీలు. ప్రధాన పార్టీల గెలుపోట ములతో సహా ఆయా పార్టీలకు ఎన్ని స్థానాలు వస్తాయనే దాని పైన కూడా పందాలు ఊపందుకున్నాయి.

అంతే కాదు ఆయా ప్రధాన పార్టీల నుంచి వివిధ నియోజకవర్గాల్లో పోటీ చేసే ప్రముఖుల మెజార్టీపైనా బెట్టింగ్‌లు కొనసాగుతున్నట్లు సమాచారం. మరోవైపు హంగ్ వచ్చే అవకాశం పైనా బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు వినికిడి. మూడో తేదీ లోపు వేల రూ.10 వేల కోట్ల మేర బెట్టింగ్ జరిగే అవకాశం ఉందని అంచనా. తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటే ఏపీ వారికి ఆసక్తి ఎందుకు అంటే.. తెలంగాణా రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపీ ఎన్నికల మీద కచ్చితంగా ఉంటుంది. కాబట్టి తెలంగాణా ఎన్నికలపై ఏపీ ప్రజలకు ప్రత్యేకమైన ఫోకస్ ఉంది. ఆ ఫోకస్ వారు బెట్టింగ్ లు పెట్టే దాకా తీసుకెళ్ళింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాలో బెట్టింగ్ రాయుళ్ళు కోట్ల రూపాయల బెట్టింగ్ కాస్తున్నారని తెలుస్తుంది. ఇక అంతే కాదు అత్యంత ముఖ్యమైన నియోజకవర్గాలుగా చెబుతున్న కొన్ని నియోజక వర్గాల పైన కూడా బెట్టింగులు కొనసాగుతున్నాయి.

ఇక ఒకటికి మూడు రెట్లు ఇస్తాం, ఒకటికి రెట్టింపు ఇస్తాం అంటూ కీలక అభ్యర్థుల గెలు పోటములపై పందెం కాస్తున్నారని సమాచారం. ఈ మారు రాష్ట్రంలో స్వతంత్రుల హవా కొనసాగుతున్న తరుణంలో ప్రముఖంగా వార్తల్లో నానుతున్న స్వతంత్ర అభ్యర్థులపైనా ప్రధాన పార్టీల అభ్యర్థుల మాదిరిగా ఆయా స్వతంత్రుల గెలుపోటములపై భారీగా బెట్టింగ్‌లు కాస్తున్నట్లు వినికిడి.

ఎపి వారికి అంత ఆసక్తి ఎందుకంటే?
తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటే ఎపి వారికి ఆసక్తి ఎందుకు అంటే తెలంగాణా రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ఫలితాల ప్రభావం ఎపి ఎన్నికల మీద కచ్చితంగా ఉంటుంది. కాబట్టి తెలంగాణా ఎన్నికలపై ఎపి ప్రజలకు ప్రత్యేకమైన ఫోకస్ ఉంది. ఆ ఫోకస్ వారు బెట్టింగ్‌లు పెట్టే దాకా తీసుకెళ్ళింది. ముఖ్యంగా ఎపిలోని ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాలో బెట్టింగ్ రాయుళ్ళు కోట్ల రూపాయల బెట్టింగ్ కాస్తున్నారని తెలుస్తుంది. ఇక అంతే కాదు అత్యంత ముఖ్యమైన నియోజకవర్గాలుగా చెబుతున్న కొన్ని నియోజక వర్గాల పైన కూడా బెట్టింగులు కొనసాగుతున్నాయి. ఇక ఒకటికి మూడు రెట్లు ఇస్తాం, ఒకటికి రెట్టింపు ఇస్తాం అంటూ కీలక అభ్యర్థుల గెలుపో టములపై పందెం కాస్తున్నారని సమాచారం.

హాట్ సీట్లపై బెట్టింగ్ బంగార్రాజుల నజర్
రాష్ట్రవ్యాప్తంగా హాట్‌సీట్‌లుగా భావిస్తున్న కొడంగల్, గజ్వేల్, సిరిసిల్ల, సిద్ధిపేట, కామారెడ్డి, దుబ్బాక, మునుగోడుతో సహా ఇటీవల ఆసక్తిక రంగా మారిన కొల్లాపూర్ వంటి నియోజకవర్గాలపై బెట్టింగ్ బంగార్రాజులు ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అయితే, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ప్రత్యేకతను సంతరించుకని ఒక్క రాష్ట్రమే కాదు.. దేశ వ్యాప్త ప్రజలను సైతం విశేషంగా అకట్టుకున్నాయి. ఈ ఎన్నికల్లో యువ ఓటర్లే కీలకం కానున్నారు. యువత సైతం ఈ ఎన్నికల్లో తమ జోరును గతంకంటే భిన్నంగా ప్రదర్శిస్తుండటం విశేషం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News