Wednesday, May 1, 2024

బైడెన్ అభిమానుల డాన్సులు.. ట్రంప్ మద్దతుదార్ల తుపాకీల ఝళిపింపు

- Advertisement -
- Advertisement -

Biden fan dances Trump supporters' gunfire

 

ఫిలడెల్ఫియా : ఫిలడెల్ఫియా, ఫోనిక్స్, డెట్రాయిట్, మిషిగన్ తదితర ప్రాంతాల్లో కౌంటింగ్ సెంటర్ల సమీపాన శుక్రవారం జో బైడెన్ మద్దతుదారులు కొందరు ఆనందంతో డాన్సు చేయగా, ట్రంప్ మద్దతు దారులు కోపంతో తుపాకీలు ఝళిపించడం కనిపించింది. అంతేకాదు ‘చోరీ ఆపండి’ అని గట్టిగా కేకలు వేశారు. ఫిలడెల్ఫియా వీధుల్లో బైడెన్ మద్దతుదారులు ఆనందంతో శుక్రవారం డ్యాన్సులు చేశారు. ట్రంప్ సాయుధ మద్దతుదారులు ఫోనిక్స్‌లో చోరీ ఆపండి అని గట్టిగా కేకలు వేశారు. విజయం వైపు బైడెన్ దూసుకువెళ్తున్నట్టు బ్యాలెట్ కౌంటింగ్ ఫలితాలు వస్తుండడంతో ఈ దృశ్యాలు కనిపించాయి.

డెట్రాయిట్‌లో రిపబ్లికన్ అధ్యక్షుని మద్దతుదారులు వందలాది మంది సాయుధులై మనం గెలిచాం అంటూ వెర్రిగా కేకలు వేశారు. డెట్రాయిట్, ఫోనిక్స్ కౌంటింగ్ సెంటర్ల సమీపాన ట్రంప్ మద్దతుదారులు రైఫిళ్లు, గన్‌లతో ర్యాలీలు నిర్వహించారు. కొందరు ఎర్రని టోపీలు పెట్టుకుని ‘అమెరికాను మళ్లీ వైభవంగా చేయు’ అని నినాదాలు చేశారు. మరికొందరు ట్రంప్ గెలుపు కోసం మోకాళ్లపై నిలుచుని ప్రార్ధనలు చేశారు. ఆరు రాష్ట్రాల్లో దాదాపు 60 నగరాల్లో శనివారం ట్రంప్‌కు మద్దతుగా ర్యాలీలు నిర్వహించడానికి ప్లాను చేశారు. అరిజోనాలో ట్రంప్ మద్దతుదారులు వందలాది మంది ఆందోళనకారులు ట్రంప్‌ను బలపరుస్తూ జెండాలు ఎగురవేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News