Monday, April 29, 2024

ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానం మార్పుకు కొన్నినెలలు పట్టవచ్చు

- Advertisement -
- Advertisement -

Trump Immigration policy change could take months: Biden

 

అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన బైడెస్ స్పష్టీకరణ

వాషింగ్టన్ : అధ్యక్షుడు ట్రంప్ తన పదవీకాలంలో ప్రవేశ పెట్టిన ఇమ్మిగ్రేషన్ విధానాలను మార్చడానికి కొన్ని నెలల సమయం పట్టవచ్చని అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన బైడెన్ స్పష్టం చేశారు. త్వరలో బైడెన్ విధాన సలహాదారు కానున్న సుశాన్ రైస్, జాతీయ భద్రతా సలహాదారుగా ఎంపికైన జేక్ సుల్లివన్ లతోపాటు బైడెన్ ఈ ఇమ్మిగ్రేషన్ విధానం మార్పుపై తొందరపడితే సరిహద్దుల్లో కొత్త సంక్షోభం తలెత్తుతుందని అభిప్రాయపడ్డారు. విల్మింగ్టన్‌లో పాత్రికేయులతో బైడెన్ మాట్లాడుతూ ఈ విషయమై మెక్సికో అధ్యక్షుడుతో లాటిన్ అమెరికాలోని తన స్నేహితులతో చర్చించడం ప్రారంభించానని చెప్పారు. దీనికి గడువు నిర్ణయించడమంటే మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుందని బైడెన్ వ్యాఖ్యానించారు. ఈ ఇమ్మిగ్రేషన్ వివాదాల పరిష్కారానికి ఎక్కువ మంది జడ్జిలు అవసరమౌతారని, అలాగే ఎక్కువ నిధులు కావలసి ఉందని ఆయన పేర్కొన్నారు. ఏదేమైనా ఈ ఇమ్మిగ్రేషన్ విధానాలను సరళీకరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. సరిహద్దులో ఇటీవల కాలంలో చొరబాట్లు ఎక్కువైన నేపథ్యంలో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News