Monday, April 29, 2024

ఇక చమురు వార్

- Advertisement -
- Advertisement -

Biden set to ban US import of Russian oil soon

రష్యా వర్సెస్ అమెరికా?

బ్యారెల్ చమురు 300 డాలర్ల గతి
అమెరికాకు రష్యా హెచ్చరిక
దిగుమతుల ఆంక్షలపై మండిపాటు
జర్మనీ పైప్‌లైన్ మూసివేత నిర్ణయం

మాస్కో : పశ్చిమ దేశాలు తమ దేశ చమురును, సహజవాయువుల కొనుగోళ్లను నిలిపివేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని మంగళవారం రష్యా హెచ్చరించింది. రష్యా అధికారిక టీవీ ద్వారా ఈ దేశ ఉప ప్రధాని అలెగ్జాండర్ నోవక్ ప్రజలనుద్ధేశించి ప్రసంగించారు. ప్రపంచ దేశాలు తమ ఆయిల్‌ను తిరస్కరించినట్లు అయితే తాము కూడా అందుకు ప్రతిచర్యలకు దిగుతామని నోవక్ హెచ్చరించారు. దీని ఫలితంగా అనివార్యంగా చమురు మార్కెట్‌పై తద్వారా ప్రపంచ విఫణిపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. చమురు ధరలు అనూహ్యంగా అసాధారణ రీతికి చేరుకుంటాయని, బ్యారెల్‌కు దాదాపుగా 300 డాలర్లు అంతకు పైగా ధరలు చేరుకుంటాయని, దీనితో అన్ని రంగాలపై పెను ప్రభావం పడుతుందని హెచ్చరించారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు తరువాతి పరిణామాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా క్రమేపీ చమురు సంక్షోభం నెలకొంటున్న తరుణంలోనే రష్యా నేత తీవ్ర స్థాయి హెచ్చరికలు వెలువడ్డాయి.

తమంత తాముగా ఎటువంటి కవ్వింపు చర్యలకు దిగేది లేదని, అయితే ఇతర దేశాలు తమ ఇంధన ఎగుమతులను నిరాకరిస్తే, ఆంక్షలకు దిగితే తాము ఊరుకునేది లేదని నోవక్ తెలిపారు. అంతకు ముందు ఓపెక్, ఓపెకేతర మంత్రుల స్థాయి సమావేశంలో కూడా ప్రసంగించారు. జర్మనీకి ప్రధాన గ్యాస్ పైప్‌లైన్‌ను మూసివేస్తామని రష్యా తెలిపింది. నోర్డ్ స్ట్రీమ్ 1 గ్యాస్ పైప్‌లైన్ ద్వారా గ్యాస్ పంపింగ్ నిలిపివేతకు సంబంధించి తమకు అన్ని హక్కులు ఉన్నాయని రష్యా ఉప ప్రధాని తెలిపారు. అయితే తాము ఇప్పటివరకూ ఎటువంటి దూకుడు నిర్ణయాలు తీసుకోలేదని, అయితే యూరోపియన్ నేతలు చేస్తున్న ప్రకటనలు పూర్తిగా రష్యాపై బురద చల్లే విధంగా ఉన్నాయని రష్యా విమర్శించింది. తమ దేశంపై తప్పుడు ఆరోపణలకు పాల్పడుతున్నారని రష్యా ఉప ప్రధాని విరుచుకుపడ్డారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News