Friday, April 26, 2024

నితీష్ కుమార్‌ను బిజెపి అవమానిస్తోంది

- Advertisement -
- Advertisement -

Prashant-Kishore

పాట్నా: జెడియు అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పట్ల బిజెపి దారుణంగా వ్యవహరిస్తోందని బహిష్కృత జెడియు ఉపాధ్యక్షుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. జనతాదళ్(యు) నుంచి బహిష్కరణకు గురైన అనంతరం మొదటిసారి తనకు, నితీష్ కుమార్‌కు మధ్య గల అభిప్రాయ భేదాల గురించి ప్రశాంత్ కిషోర్ మంగళవారం మీడియాకు తెలియచేశారు. నితీష్‌జీ తనను ఎప్పుడూ ఆయన కుమారుడిలాగే చూసుకున్నారని, ఆయన తనకు తండ్రితో సమానమని కిషోర్ చెప్పారు.

ఆయన తీసుకున్న ఏ నిర్ణయమైనా తాను అంగీకరిస్తానని, పార్టీలోకి చేరుకున్న ఆయనే తనను పార్టీ నుంచి బహిష్కరించారని కిషోర్ అన్నారు. తనను పార్టీ నుంచి బహిష్కరించినందుకు తనకు నితీష్‌జీపై ఎటువంటి కోపం లేదని కిషోర్ చెప్పారు. తనకు, ముఖ్యమంత్రి నితీష్‌కి మధ్య ఏర్పడినవి కేవలం సైద్ధాంతిక విభేదాలేనని ఆయన వివరించారు. లోక్‌సభ ఎన్నికల కాలంలో ఇవి మొదలయ్యాయని, అవి కేవలం సైద్ధాంతికపరమైనవేనని ఆయన చెప్పారు. గాంధీజీ, లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్, రాంమనోహర్ లోహియా బాటను తాను వదలేనని నితీష్‌జీ ఎప్పుడూ చెబుతారని, గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసే వ్యక్తి గాడ్సేను కీర్తించే వారి పక్కన ఎలా నిలబడగలరని కిషోర్ ప్రశ్నించారు.

నితీష్ కుమార్‌ను బిజెపి ఏమాత్రం గౌరవించడం లేదని ఆయన ఆరోపించారు. 2014 నుంచి తాను నితీష్‌ను చూస్తున్నానని, అప్పట్లో ఆయనకు ఎంతో గౌరవమర్యాదలు లభించేవని కిషోర్ అన్నారు. కాని బీహార్‌లో ఎన్‌డిఎ తరఫున నాయకుడిగా నితీష్ ఉంటారని ఇప్పుడు ఒక గుజరాత్ నాయకుడు(హోం మంత్రి అమిత్ షా) ప్రకటిస్తాడని, ఇది సబబు కాదన్నది తన అభిప్రాయమని ఆయన చెప్పారు. నితీష్ ఏం చేయాలో చెప్పే అధికారం ఇతర నాయకులకు లేదని కిషోర్ అన్నారు.

BJP not respects Nitish Kumar, says Prashant Kishore, PK says that he wont question Nitish on his decision to expel him from JDU

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News