Monday, April 29, 2024

8 జాతీయ పార్టీల వార్షిక ఆదాయం రూ. 1,373.783 కోట్లు

- Advertisement -
- Advertisement -

BJP revenue for financial year 2020-21 is Rs. 752.337 crores

రూ.752.337 కోట్లతో బిజెపి టాప్

న్యూఢిల్లీ: దేశంలోని 8 జాతీయ రాజకీయ పార్టీల మొత్తం వార్షిక ఆదాయం 2020-21ఆర్థిక సంవత్సరంలో రూ. 1,373.783 కోట్లని, ఇందులో బిజెపి వాటా దాదాపు 55 శాతమని ప్రభుత్వేతర ఎన్నికల పరిశీలన సంస్థ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్(ఎడిఆర్) శుక్రవారం వెల్లడించింది. ఎన్నికల సంఘం(ఇసి) గుర్తించిన ఎనిమిది రాజకీయ పార్టీలలో బిజెపి, కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్, నేషనల్ పీపుల్స్ పార్టీ ఉన్నాయి. 2020-21ఆర్థిక సంవత్సరంలో ఈ ఎనిమిది జాతీయ పార్టీలు దేశవ్యాప్తంగా సేకరించిన మొత్తం ఆదాయం రూ. 1,373.783 కోట్లని ఎడిఆర్ తెలిపింది. ఈ విషయాన్ని ఈ పార్టీలు ఎన్నికల కమిషన్‌కు సమర్పించాయని తెలిపింది. 2020-21ఆర్థిక సంవత్సరంలో బిజెపి ఆదాయం రూ. 752.337 కోట్లు కాగా రూ. 285.765 కోట్లతో రెండవ స్థానంలో కాంగ్రెస్ ఉందని ఎడిఆర్ తెలిపింది. 2019-20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2020-21లో బిజెపి వార్షిక ఆదాయం 79.24 శాతం తగ్గిందని తెలిపింది. 2019-20లో బిజెపి వార్షిక ఆదాయం రూ. 3,623.28 కోట్లు ఉండగా 2020-21లో అది రూ. 752.337 కోట్ల తగ్గింది. కాంగ్రెస్ పార్టీ ఆదాయం కూడా గతంలో పోలిస్తే 58.11 శాతం తగ్గినట్లు ఎడిఆర్ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News