Saturday, April 27, 2024

దేశంలో అందరికీ ఒకటే చట్టం ఉండాలి: అమిత్ షా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఇప్పుడు జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలలో బిజెపి 2014 ఎన్నికల కన్నా అధిక సీట్లను గెలుచుకుంటుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం ధీమా వ్యక్తం చేశారు. అన్ని వారసత్వ పార్టీలకు ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. లౌకిక దేశంలో ప్రజలందరికీ ఒకే చట్టం ఉండాలని విశ్వసిస్తున్న బిజెపికి ఈ ఎన్నికల్లో ఉమ్మడి పౌర స్మృతి(యుసిసి) అజెండాగా ఉండనున్నదని ఆయన తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్‌లో గత ఎన్నికలతో పోలిస్తే అధిక లోక్‌సభ స్థానాలను బిజెపి గెలుచుకుంటుందని న్యూస్ 18 రైజింగ్ భారత్ సమ్మిట్‌లో మాట్లాడుతూ అమిత్ షా విశ్వాసనం వ్యక్తం చేశారు.

1950 నుంచి యుసిసిని తాము లెవనెత్తుతున్నామని, దీని కోసం తమ పార్టీ పోరాడిందని షా చెప్పారు. దీని నుంచి తాము పక్కకకు తప్పుకోలేమని ఆయన అన్నారు. లౌకికవాద దేశంలో అందరికీ ఒకే చట్టం ఉండాలని తాము విశ్వసిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. దేశ ప్రజలకు బిజెపి ఇచ్చే కానుకగా యుసిసిని అభివర్ణించారు. పౌరసత్వ సవరణ చట్టంపై(సిఎఎ) ప్రతిపక్షాలు ప్రజలలో అపోహలు సృష్టిస్తున్నాయని ఆయన ఆరోపించారు.

ఇటీవల సిఎఎకి సంబంధించిన నిబంధనలను ప్రభుత్వం జారీచేయడాన్ని ప్రస్తావిస్తూ దేశంలోని మైనారిటీల పౌరసత్వాన్ని సిఎఎ లాగేసుకుంటుందన్న దుష్ప్రచారాన్ని ప్రతిపక్షాలు చేస్తున్నాయని, అయితే ఎవరి పౌరసత్వాన్ని సిఎఎ తొలగించబోదని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్‌కు చెందిన హిందూ, సిక్కు, జైన, బౌద్ధ, క్రైస్తవ, పార్శీ మతాలకు చెందిన శరణార్థులకు మాత్రమే భారత పౌరసత్వం అందచేస్తామని అమిత్ షా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News