Monday, April 29, 2024

దుబ్బాకలో బిజెపి విజయం

- Advertisement -
- Advertisement -

BJP win in Dubbaka byelection

 

టిఆర్‌ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతపై 1431 ఓట్ల తేడాతో రఘునందన్ విజయం
రౌండ్ రౌండ్‌కు నరాలు తెగే ఉత్కంఠ
కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు

రఘునందన్(బిజెపి) 62,984

సుజాత(టిఆర్‌ఎస్) 61,553

శ్రీనివాస్‌రెడ్డి(కాంగ్రెస్) 22,054

మన తెలంగాణ/హైదరాబాద్ : అత్యంత ఉత్కంఠత, నరాలుతెగే భావోద్వేగం మధ్యలో దుబ్బాక ఎన్నికల కౌంటింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో బిజెపి అ భ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించా రు. ఈ ఉపఎన్నికల్లో టిఆర్‌ఎస్ బిజెపి మధ్య గట్టి పోటీ నెలకొంది. ఎట్టకేలకు బిజెపి గట్టెక్కి ంది. టిఆర్‌ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతపై 1431 ఓట్ల ఆధిక్యతతో బిజెపి అభ్యర్థి రఘున ందన్ రావు విజయం సాధించారు. రెండవ స్థా నంలో టిఆర్‌ఎస్ నిలిచింది. టిఆర్‌ఎస్, బిజెపి రౌండ్ రౌండ్‌కు ఫలితాలు మారుస్తూ ఉత్కంఠతకు తెరలేపింది. మొదటి కొన్నిరౌండ్లలో బిజె పి ముందజలో ఉన్నప్పటికీ 6,7 రౌండ్లలో టిఆర్‌ఎస్ సమీప బిజెపిపై ఓట్లశాతం పెంచుకోగలిగింది. ఆతర్వాత వరుసగా 13 నుంచి 18వ రౌండ్ వరకు టిఆర్‌ఎస్ ఆధిక్యతలో కొనసాగింది. 18వ రౌండ్ పూర్తి అయ్యే సరికి టిఆర్‌ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత 174 ఓట్ల లీడ్ తో ముందువరుసకు చేరారు. దౌలతాబాద్, రా యపోల్‌ల్లో టిఆర్ సత్తాచాటింది. అయితే 20 నుం టచి 23 రౌండ్స్ ఓట్ల లెక్కింపులో తిరిగి బి జెపి ముందువరుసలోకి వెళ్లి విజయాన్ని న మోదు చేసుకుంది.

ఎన్నికల కౌంటింగ్ అత్య ంత ఉత్కంఠత రేపింది. నువ్వానేనా అంటూ ముందుకు సాగింది. పోస్టల్ బ్యాలెట్స్‌లో మొ త్తం 1453 పోలవ్వగా అందులో 1381 ఓట్లు మాత్రమే చెల్లుబాటు అయ్యాయి. చెల్లుబాటు యిన పోస్టల్ ఓట్లలో టిఆర్‌ఎస్ పార్టీకి 720, బిజెపికి 368,కాంగ్రెస్‌కు 142 ఓట్లు వచ్చా యి. టిఆర్‌ఎస్ సుజాత సమీప బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు పై 6వ రౌండ్‌లో 53, 7వ రౌండ్‌లో 182, 13వ రౌండ్‌లో 364, 14వ రౌండ్‌లో 288, 15వ రౌండ్‌లో 955, 16వ రౌండ్‌లో 749, 17వ రౌండ్‌లో 872, 18వ రౌండ్‌లో 688,19వ రౌండ్‌లో 425 ఓట్ల ఆధిక్యత సాధించింది. అయితే రౌండ్ రౌండ్‌కు ఉత్కంఠత కొనసాగింది.13 నుంచి 19 రౌండ్లలో 5వేలకు మించి ఓట్లు సాధించింది. అయితే స్వల్పమెజారిటీతో ఎట్టకేలకు బిజెపి గెలిచినా టిఆర్‌ఎస్ ఓట్ల సరళి బిజెపికి ముచ్చెమటలు పోయించింది. అయితే 20,21,22,23 రౌండ్లలో టిఆర్‌ఎస్ పై బిజెపి విజయం సాధించింది. అలాగే 12వ రౌండ్‌లో 83 ఓట్ల మెజారిటీ కాంగ్రెస్ సాధించింది. దుబ్బాక ఉపఎన్నికల్లో మొత్తం 1,64,186 ఓట్లు పోలవ్వగా,బిజెపికి 62,772, టిఆర్‌ఎస్ పార్టీకి 61,302,కాంగ్రెస్‌కు 21,819 ఓట్లు పోలయ్యాయి. స్వతంత్య్ర అభ్యర్థి బండారు నాగరాజు 60 ఓట్లు వచ్చిననట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అలాగే తెరుచుకోని నాలుగు ఇవిఎంల్లోని 1649 ఓట్లు కౌంటింగ్ రాలేదు.

మొరాయించిన ఇవిఎంలు

దుబ్బాక ఉపఎన్నికల్లో 14 టెబుళ్లపై 23 రౌండ్స్ ఓట్ల లెక్కింపు జరిగాయి. ప్రతి రౌండ్‌లో ఉత్కంఠత నెలకొన్నప్పటికీ నాలుగు ఇవిఎంలు తెరుచుకోకపోవడంతో రాజకీయ పార్టీలు ఆందోళనకు గురయ్యాయి. ఇందులో ప్రధానంగా పోతారెడ్డి పోలింగ్ కేంద్రానికి సంబంధించిన ఇవిఎంలో 413ఓట్లు, తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్ 583, దౌలతాబాద్ మండలం సూరంపల్లి 314,అరెపల్లి 339 ఓట్లు ఉన్నాయి. ఈ నాలుగు ఇవిఎంల్లో 1649 ఓట్లు ఉన్నాయి. వీటిలో రెండింటిని సాయంత్రం 7గంటల సుమారులో తెరిచారు. ఇవిఎంలో టిఆర్‌ఎస్ అభ్యర్థి సుజాతకు 39 ఓట్లఆధిక్యత రావడంతో టిఆర్‌ఎస్ అభ్యర్థి రఘనందన్ కు 1,118 ఓట్ల ఆధిక్యంత నుంచి 1079 ఆధిక్యతకు చేరకుంది. ఇంకాతెరుచుకోని రెండు ఇవిఎంలో కేవలం 897 ఓట్లు ఉండటంతో బిజెపి అభ్యర్థిని ఎన్నికల విజయాన్ని అధికారికంగా ధృవీకరించారు. అయితే ఇప్పటికీ కౌంటింగ్ జరిగిన వాటిలో బిజెపి గెలిచింది. టెక్నికల్ సమస్యతోనే ఇవిఎంలు తెరుకోవడంలేదని ఎన్నికల అధికారులు తెలిపారు.

23 రౌండ్లలో జరిగిన ఓట్ల లెక్కింపు

కరోనా నిబంధనలు పాటిస్తూ 23 రౌండ్లలో దుబ్బాక ఎన్నికల కౌంటింగ్ జరిగింది. ఇక రౌండ్‌ల వారిగా పరిశీలిస్తే మొదటి రౌండ్‌లో టిఆర్‌ఎస్ 2867, బిజెపి3208, కాంగ్రెస్ 648 ఓట్లు సాధించింది. రెండవ రౌండ్‌లో టిఆర్‌ఎస్ 2490, బిజెపి 3284,కాంగ్రెస్ 667 ఓట్లు పోలయ్యాయి. మూడవ రౌండ్‌లో టిఆర్‌ఎస్ 2607,బిజెపి 2731, కాంగ్రెస్ 616 ఓట్ల ఉసాధించారు. 4వ రౌండ్‌లో టిఆర్‌ఎస్ 2407, బిజెపి 3832, కాంగ్రెస్ 227, 5వ రౌండ్‌లో టిఆర్‌ఎస్ 3126 ఓట్లు సాధించగా బిజెపి 3462, కాంగ్రెస్ 566. 6వ రౌండ్‌లో టిఆర్‌ఎస్ 4062,బిజెపి 3709,కాంగ్రెస్ 530 ఓట్లు పోలయ్యాయి. 7వ రౌండ్‌లో టిఆర్‌ఎస్ 2718,బిజెపి 2536,కాంగ్రెస్ 749. 8వ రౌండ్‌లో టిఆర్‌ఎస్ 2495,బిజెపి 3116, కాంగ్రెస్ 1122.9వ రౌండ్‌లో టిఆర్‌ఎస్ 2329,బిజెపి 3413, కాంగ్రెస్ 675.10 టిఆర్‌ఎస్ 2948,బిజెపి 2492, కాంగ్రెస్ 899. 11వ రౌండ్‌లో టిఆర్‌ఎస్ 2766, బిజెపి 2965,కాంగ్రెస్ 1883 సాధించగా 12వ రౌండ్‌లో టిఆర్‌ఎస్ 1900, బిజెపి 1997,కాంగ్రెస్ 2080, 13వ రౌండ్‌లో టిఆర్‌ఎస్ 2824,బిజెపి 2520, కాంగ్రెస్ 1212,14వ రౌండ్‌లో టిఆర్‌ఎస్ 2537,బిజెపి 2249, కాంగ్రెస్ 784. 15వ రౌండ్‌లో టిఆర్‌ఎస్ 3027,బిజెపి 2072,కాంగ్రెస్ 1500. 16 రౌండ్‌లో టిఆర్‌ఎస్ 3157,బిజెపి 2408,కాంగ్రెస్ 674. 17వ రౌండ్‌లో టిఆర్‌ఎస్ 2818,బిజెపి 1946,కాంగ్రెస్ 1705.18వ రౌండ్‌లో టిఆర్‌ఎస్ 3215 బిజెపి 2527,కాంగ్రెస్ 852.19వ రౌండ్‌లో టిఆర్‌ఎస్ 2760, బిజెపి 2335.కాంగ్రెస్ 976. 20వ రౌండ్‌లో టిఆర్‌ఎస్ 2440, బిజెపి 2931,కాంగ్రెస్ 1058. 21వ రౌండ్‌లో టిఆర్‌ఎస్ 2048.బిజెపి 2428,కాంగ్రెస్ 845. 22వ రౌండ్‌లో టిఆర్‌ఎస్ 2520 బిజెపి 2958,కాంగ్రెస్ 971 ఓట్లు రాగా 23 రౌండ్‌లో టిఆర్‌ఎస్ 1241,బిజెపి 1653 కాంగ్రెస్ 580 ఓట్లను రాజకీయ పార్టీలు సాధించాయి.అయితే 23 రౌండ్లలో కౌంటింగ్ జరగగా 12 రౌండ్లలో బిజెపి ఆధిక్యత సాధించింది.

బండి సంజయ్‌కు అమిత్‌షా అభినందన

దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించడం పట్ల బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు కేంద్ర మంత్రి అమిత్‌షా అభినందనలు తెలిపారు. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ఎన్నికల కౌంటింగ్‌లో బిజెపి అభ్యర్థి రఘునందన్‌రావు విజయం సాధించారు. సోలిపేట రామలింగారెడ్డి మృతితో జరిగిన ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్ నుంచి సోలిపేట సుజాత, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాసరెడ్డి పోటీ చేశారు. తెలంగాణ బిజెపి నాయకులంతా సమిష్టిగా పోరాడి దుబ్బాకలో విజయం సాధించినందుకు అమిత్‌షా అభినందనలు తెలియజేశారు.

బండి సంజయ్ విజయోత్సాహం

దుబ్బాక ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి గెలవడంపై నాంపల్లిలోని బిజెపి ప్రధాన కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున సందడి వాతావరణం నెలకొంది. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ సంతోషం వ్యక్తం చేశారు. కార్యకర్తలతో కలిసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. కార్యకర్తలు టపాసులు పేల్చి సంబురాలు చేసుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను కార్యకర్తలు భుజాలపై ఎత్తుకుని నినాదాలు చేశారు. ఉప ఎన్నిక ఫలితం త్వరలో జరుగబోయే జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో అనుకూల ఫలితాలకు సంకేతమని బండి సంజయ్ తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News