Monday, April 29, 2024

స్టెరాయిడ్స్‌తోనే బ్లాక్‌ఫంగస్: గులేరియా

- Advertisement -
- Advertisement -

Black fungus disease with steroids: Guleria

 

న్యూఢిల్లీ : దేశంలో తలెత్తిన బ్లాక్‌ఫంగస్ కేసులతో ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. రోగుల చికిత్సవిధానాలలో అత్యధిక స్థాయిలో స్టెరాయిడ్స్ వాడకం లేదా వీటి దుర్వినియోగంతో ఈ బ్లాక్‌ఫంగస్ వ్యాధి సోకుతోందని ఆయన వివరించారు. రోజురోజుకీ ఇది ప్రాణాంతకం అవుతోందని విలేకరుల సమావేశంలో అంగీకరించారు. ఎయిమ్స్‌లోనే ఇప్పటివరకూ 23 మందికి ఈ ఫంగస్ నివారణ చికిత్సలు జరుగుతున్నాయని, వీరిలో 20 మంది వరకూ కొవిడ్ పేషెంట్లు ఉన్నారని, ఓ వైపు కరోనా పాజిటివ్‌గా తేలడం, మరో వైపు బ్లాక్‌ఫంగస్‌కు గురి కావడం జరిగిందని వివరించారు. మ్యుకోర్మికోసిస్‌గా పిలిచే బ్లాక్‌ఫంగస్ కేసులు 500 వరకూ నమోదు అయ్యాయి. వివిధ రాష్ట్రాలు కలిపి ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్యను తెలియచేస్తున్నట్లు చెప్పారు. ఇది ఎక్కువగా ముఖాన్ని టార్గెట్ చేసుకుంటుంది. ముక్కు, కంటి వలయం తరువాత బ్రెయిన్‌ను దెబ్బతీస్తుంది.

తరువాత ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. కంటిపై ఈ ఫంగస్ తీవ్రత చివరికి కంటిచూపు పోవడానికి దారితీస్తుందని గులేరియా తెలిపారు. ఎక్కువగా ఈ ఫంగస్ కణజాలం నేలపై, గాలిలో చివరికి ఆహారంలో కూడా ఉంటుంది. ఈ కణజాలంలో ఏది ఎక్కువగా ప్రభావితం చేస్తుంది? అనేది ఇతర పరిస్థితులను బట్టి కూడా ఉంటుందని తెలిపారు. అయితే అత్యధికంగా బ్లాక్‌ఫంగస్ సంక్రమణలు స్టెరాయిడ్స్ మితిమీరి వాడటం వల్ల జరుగుతుంది. కొవిడ్ 19 రోగులకు చికిత్సల దశలో తొందరగా నయం అయ్యేందుకు ఎక్కువ శక్తిగల మందులు ఇంజిక్షిన్లు వాడటం వల్ల ఎక్కువగా బ్లాక్‌ఫంగస్ సంక్రమణలకు దారితీస్తుందని గులేరియా వివరించారు.

వచ్చే రెండు నెలల్లో ఎక్కువ వ్యాక్సిన్లు
ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా వెల్లడి

న్యూఢిల్లీ: దేశంలో వచ్చే రెండు నెలల్లో ఎక్కువ వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని, దీనితో వ్యాక్సినేషన్ల ప్రక్రియ వేగవంతం అవుతుందని ఎయియ్స్ చీఫ్ రణదీప్ గులేరియా తెలిపారు. ప్రస్తుత కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో ఆయన మేదాంత హాస్పిటల్ ఛైర్మన్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. టీకాలను ప్రాధాన్యతక్రమంలో వేయడం మంచిదని, ముందుగా వయోవృద్ధులకు టీకాలు అందాల్సి ఉంటుంది. వారికి ఇతరత్రా శారీరక బలహీనతలు ఉండటం, కరోనా వస్తే వృద్ధులు ఎక్కువగా మరణించడం వంటి పరిణామాలతో టీకాలు వారికి ముందుగా వేయాల్సి ఉందని వివరించారు. ఇప్పుడు దేశంలో రెండు టీకాలు అందుబాటులో ఉన్నాయి.

వీటితోనే అత్యధికులకు టీకాలు అందించడం అసాధ్యం అవుతుంది.వచ్చే రెండునెలల్లో మరికొన్ని వ్యాక్సిన్లు వస్తాయని, విదేశాలకు చెందిన టీకా ఉత్పత్తిదార్లు ఇక్కడ తమ ఉత్పత్తి విభాగాలను ఏర్పాటు చేసుకుంటారు. దీని వల్ల టీకాల ఉత్పత్తి ఎక్కువ అవుతుంది. త్వరలోనే జాన్సన్ అండ్ జాన్సన్ టీకాకు అనుమతి వస్తుందని భావిస్తున్నామని , ఇక మన దేశంలోని కంపెనీలకు చెందిన వ్యాక్సిన్లు కూడా సిద్ధం అవుతాయి. వచ్చే ఆరు నుంచి ఎనిమిది వారాల వ్యవధిలో ఇవి వాడకానికి అందుబాటులోక వస్తాయని , మొత్తం మీద టీకాలు ఎక్కువ కావడం వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఊతం కల్పిస్తుందని వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News