Saturday, April 27, 2024

యువతకు కరోనాతో బ్రెయిన్ స్ట్రోక్

- Advertisement -
- Advertisement -

Brain stroke with corona in young people

 

వాషింగ్టన్ : ఆరోగ్యంగా ఉండే యువతకు కరోనా వైరస్ సోకితే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ విషయం ఓ శాస్త్రీయ అధ్యయనంలో వెల్లడైంది. లక్షణాలు లేకుండా యువత కరోనాకు గురి అయినా మెదడు నరాలు చిట్లే ప్రమాదం ఉందని తేల్చారు. అమెరికాలోని థామస్ జెఫర్‌సన్ యూనివర్శిటీ పరిశోధకులు, వారి సహోద్యోగుల సాయంతో వైరస్ సోకిన రోగులపై సమగ్ర పరిశోధనలు చేపట్టారు. ఈ క్రమంలో కరోనా వచ్చిన వారిలో ప్రత్యేకించి ఆరోగ్యకరంగా ఉండే యువతకు ఎక్కువగా బ్రెయిన్ స్ట్రోక్ రిస్కు ఉందని గమనించారు. మార్చి 20 నుంచిఎప్రిల్ పది మధ్యలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన కోవిడ్ రోగుల పరిస్థితిని వీరు విశ్లేషించారు. సాధారణంగా తలెత్తే బ్రెయిన్ స్ట్రోక్‌లకు ఈ స్ట్రోక్‌లకు చాలా తేడా ఉందనే విషయాన్ని ఈ దశలో పరిశోధకులు గుర్తించారు. న్యూరోసర్జరీ జర్నల్‌లో వీరి పరిశోధనల వివరాలు వెల్లడించారు. 30, 40, 50 సంవత్సరాల వయస్సులలో ఉన్న వారిలో తలెత్తిన బ్రెయిన్ స్ట్రోక్‌లు తక్కువ స్థాయిలో ఉండాల్సింది.

అయితే 70 లేదా 80 సంవత్సరాల వయోదశలో ఉండే వారిలో తలెత్తే బ్రెయిన్ స్ట్రోక్‌ల స్థాయిలో ఇతరులలో ఈ పరిణామం చోటుచేసుకుందని తెలిపారు. న్యూయార్క్‌లోని ఎన్‌వైయు లాంగోనే మెడికల్ సెంటర్‌కు చెందిన సర్జన్ల సాయంతో పరిశోధనలు జరిగాయి. వైరస్ సోకిన వారిలో తలెత్తిన స్ట్రోక్‌ల గురించి తాము అంచనా వేసినట్లు వివరించారు. తమ పరిశోధనల ఫలితాలు ఇప్పటికీ ప్రాధమికమే అని, అయితే 14 మందిలో తాము జరిపిన అధ్యయన క్రమంలో తేలిన విషయం ఆందోళనకరంగా మారిందని తెలిపారు. వారిలో అత్యధికులు యువకులు కావడం, వారిలో కొందరికి వైరస్ సోకిన లక్షణాలు కన్పించకపోవడం ప్రధాన అంశం అని తెలిపారు. వైరస్ లక్షణాలు లేని యువతలో మెదడు రక్తనాళాలు చిట్లుతున్నాయని, ఇది బ్రెయిన్ స్ట్రోక్‌కు దారితీస్తుందని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News