Thursday, May 9, 2024

ముక్కు పొడవుగా ఉందని పెళ్లి రద్దు చేసిన అమ్మాయి

- Advertisement -
- Advertisement -

 

బెంగళూరు: కన్నడ పెళ్లి కొడుకు ముక్కు పొడువుగా ఉందని అమెరికా అమ్మాయి పెళ్లి రద్దు చేసుకున్న సంఘటన కర్నాటకలోని కోరమంగళా ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రమేష్(35) అనే వ్యక్తి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. మాట్రిమోనీలో అమెరికాకు చెందిన రేష్మి అనే అమ్మాయిని అతడు కలుసుకున్నాడు. ఇద్దరు ఆన్‌లైన్‌లో గత కొన్ని రోజుల నుంచి మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు మంచి పొజిషన్‌లో ఉండడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో అమెరికా నుంచి వచ్చిన ఆమె చెల్లెలు లక్ష్మిని తాను కలిశానని, వాళ్లు పెళ్లికి ఒప్పుకోవడంతో రేష్మి తల్లిదండ్రులు, తన తల్లిదండ్రులు హెచ్‌ఎస్‌ఆర్ లే అవుట్‌లో కలిశారు. సెప్టెంబర్ 9న రేష్మి, రమేష్‌కు ఎంగేజ్‌మెంట్ జరిగింది. కానీ రేష్మి తమ పెళ్లి తిరుపతిలో జరగాలని పట్టుబట్టింది. దీంతో బంధువులు, స్నేహితులు అందరూ బెంగళూరు ఉన్నారని తిరుపతిలో పెళ్లి చేయడం కుదరదని రమేష్ కుటుంబ సభ్యులు తెలిపారు. రేష్మి వినకపోవడంతో తిరుపతిలో పెళ్లి వేడుకలు చేద్దామని నిర్ణయం తీసుకున్నారు. 2020 జనవరి 30న పెళ్లి తేదీన నిర్ణయించారు.

అదే నెలలో తిరుమలలో లక్ష రూపాయలు పెట్టి 70 రూమ్‌లు బుక్ చేశారు. నాలుగు లక్షల రూపాయలు పెట్టి పెళ్లి బట్టలు కొనుగోలు చేసి అనంతరం రేష్మి తిరిగి అమెరికాకు వెళ్లిపోయింది. అక్టోబర్ 23న తనకు పెళ్లి ఇష్టం లేదని రద్దు చేసుకుందామని కబురు పంపింది. దీంతో వెంటనే పెళ్లి కుమారుడు పెళ్లి కూతురుకు ఫోన్ చేశాడు. పెళ్లి కుమారుడు ముక్కు పొడవుగా ఉందని తనకు నచ్చలేదని, ముక్క సర్జరీ చేసుకుంటే పెళ్లి చేసుకుంటానని షరతు పెట్టింది. వెంటనే రేష్మి అతడి నంబర్‌ను బ్లాక్ చేసింది. రమేష్. అతడి కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో రేష్మిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు ఐపిసి 417, 420 ప్రకారం కేసు నమోదు చేశారు. రమేష్ ముక్కు పొడవుగా ఉండడంతో పెళ్లి రద్దు చేసుకున్నామని పోలీసులకు సమాచారం ఇచ్చింది.

 

Bride Cancelled Marriage with Groom’s Long Nose
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News