Monday, April 29, 2024

24 గంటల ఉచిత కరెంటు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బిఆర్‌ఎస్

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి:24 గంటల ఉచిత కరెంటును అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్‌ఎస్ ప్రభుత్వమని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని, మూడు అంగన్వాడి కేంద్ర భవనాలకు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంత రం వాసాలమర్రి గ్రామంలో ఒక కోటి 65 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన సబ్ స్టేషన్ ను జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డితో క లిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో 9 సబ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాసాలమర్రి గ్రా మంలో గతంలో 103 ఎకరాలు విస్తీర్ణం సాగు కాగా ఇప్పుడు 1127 ఎకరాలు సాగులోకి వచ్చిందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ మిషన్, భగీరథ తోపాటు పుట్టిన పాప నుండి చనిపోయే వ్యక్తి వరకు అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమ ని అన్నారు. అవగాహన లేని కాంగ్రెస్ నాయకులు రైతులపై చిన్నచూపు చూస్తున్నారని అన్నారు. చేనేత, గీత కులవృత్తులకు ఆర్థిక భరోసాను కల్పిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజల అభివృద్ధిని చూసి కాంగ్రెస్ నాయకులు ఓర్వలేక పోతున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులకు కరెంటు షాక్ కొడుతుందని అన్నారు .రైతుల బతుకులు ఆగం చేయాలని కాంగ్రెస్ నాయకులు చూస్తున్నారని అన్నారు.

రైతుబంధు, రైతు బీమాతో పాటు వాసాల మర్రిలో 312 ఆసరా పెన్షన్లు, 36 బీడీ కార్మికుల పెన్షన్లు, 75 మందికి దళిత బంధు పథకం అమలు చేసినట్టు తెలిపారు. ఆర్థికంగా, సామాజికంగా దళిత బందుతో ఎదిగినారని అన్నారు. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారని తెలిపారు. గ్రామంలో చనిపోయిన 13 మందికి రైతు బీమా అందించినట్లు తెలిపారు. గ్రామంలో 10 కోట్ల 14 లక్షల 12 వేల రూపాయలు రైతుబంధు వచ్చిందని తెలిపారు. తెలంగాణ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రభుత్వానికి అనేక అవార్డులు వచ్చాయని అన్నారు. రాబోవు కాలంలో బంగారు తెలంగాణ సాధనగా ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, జెడ్పి వైస్ చైర్మన్ ధనావత్ బిక్కు నాయక్, ఎంపీపీ భూక్యా సుశీల రవీందర్ నాయక్ ,సర్పంచ్ పోగుల ఆంజనేయులు, ఎంపీటీసీ పలుగుల నవీన్ కుమార్, మండల స్పెషల్ ఆఫీసర్ ,ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జినుకల శ్యాంసుందర్, పిఎసిఎస్ చైర్మన్ సింగిరెడ్డి నరసింహారెడ్డి, బిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు విన్నపరెడ్డి నరేందర్ రెడ్డి, సిడిపిఓ చంద్రకళ ,ఎంపీడీవో మానే ఉమాదేవి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎస్ ఈ సాయి నందు, డి ఈ మల్లికార్జున్, ఏఈ బిక్షపతి, ఎంపీటీసీ గిద్దె కరుణాకర్, సర్పంచులు నాంసాని సత్యనారాయణ, కల్లూరి ప్రభాకర్ రెడ్డి ,వెన్నకుచి రామ్మోహన్ శర్మ, ఇమ్మడి మల్లప్ప ,నాగారం మహేందర్, కో ఆప్షన్ రహమత్, పీహెచ్సీ డాక్టర్ సుధీర్ రెడ్డి ,ఎంఈఓ జంగిటి కృష్ణ ,పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ ,అంగన్వాడీ టీచర్లు, విద్యుత్ సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు ,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News