Saturday, April 27, 2024

విషం కక్కిన ‘మోడీ’

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఒకరోజు రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్రమోడీ శనివారం హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు, విమర్శలపై రాష్ట్ర మంత్రులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన చేసిన ఆరోపణల న్నీ సత్యదూరమన్నారు. ప్రధాని కేంద్ర ప్ర భుత్వ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడానికి వచ్చినట్లుగా లేదని, తెలంగాణ పై తన కడుపులోని విషాన్ని కక్కడానికి వ చ్చినట్లు ఉందని మంత్రులు ధ్వజమెత్తారు. ఒక దేశ ప్రధాని రాష్ట్ర పర్యటనకు వస్తే స హజంగానే ఆ రాష్ట్రానికి ఎంతో మే లు చేసే విధంగా వరాలు కురిపించి పోతుంటారన్నారు. కానీ మోడీ తెలంగాణకు వచ్చిన ప్రతిసారి రాష్ట్రంపై విషం చిమ్మడం అలవాటుగా మారిందని మండిపడ్డారు. ఫెడరల్ వ్యవస్థకు మోడీ పూర్తిగా తూట్లు పొ డుస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాలను సమాన దృష్టితో చూడాల్సిన ప్రధాని, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇది ఫెడరల్ స్ఫూర్తికే విరుద్ధమని మంత్రులు వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతూ ప్రధానిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ప్రతిమాట సత్య దూరం

కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ప్రధాని మోడీ పా ల్గొనేందుకు వచ్చినట్లుగా కాకుండా, రా ష్ట్రంపై తన కడుపులోని విషాన్ని కక్కడానికి వచ్చినట్లు ఉందని మంత్రి హరీశ్‌రావు అ న్నారు. ఆయన చెప్పిన ప్రతి మాట సత్య దూరమన్నారు. ప్రధానిగా ఇన్ని అబద్ధాలు ఆడడం ఆయనకే చెల్లిందని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఆసరా పెన్షన్, రైతు బంధు వంటివి నేరుగా లబ్ది దారుల ఖాతాలో జమ అవుతున్నాయన్నారు. తన వల్లే డిబిటి మొదలైనట్టు మోడీ అనడం పచ్చి అబద్దమన్నారు. ఇందులో గొప్ప చెప్పుకోవాల్సింది ఏముందని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.

రైతు బంధును కాపీ కొడితే పిఎం కిసాన్ అయ్యిందన్నారు. పిఎం కిసాన్ వల్లే మొదటి సారి రైతులకు లబ్ది అని చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. రైతు బంధుతో పోల్చితే పిఎం కిసాన్ సాయమెంత? అని హరీశ్‌రావు నిలదీశారు. వ్యవసాయానికి, పరిశ్రమలకు చేయూత ఇస్తున్నాం అని మోడీ చెప్పడం పూర్తిగా అవాస్తవమన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఐటిఐఆర్‌ను బెంగళూరుకు తరలించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన వెంటనే గుజరాత్‌లో అర్బిట్రేషన్ సెంటర్ పెట్టారని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. తెలంగాణ ధాన్యాన్ని కొనకుండా మోడీ ప్రభుత్వం రైతుల కంట కన్నీరు పెట్టించిందన్నారు. ఇవన్నీ చేసింది మీ ప్రభుత్వం కాదా? అని మోడీని ఉద్దేశించి హరీశ్‌రావు ప్రశ్నించారు.

కేవలం అదానీ వాదం గురించి ప్రజల దృష్టి మళ్లించడానికి.. లేని పరివార వాదం గురించి మాట్లాడడం మీకే చెల్లిందని ఆయన ధ్వజమెత్తారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సహకారం అందించడం లేదని మోడీ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నిజానికి ఈ పరిస్థితి రివర్స్‌గా ఉందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన గిరిజన యూనివర్సిటీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, జాతీయ హోదా వంటివి ఇవ్వకుండా కేంద్రం తెలంగాణకు ఎలాంటి సహకారం అందించడం లేదన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ, ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై సవతి ప్రేమ చూపిస్తున్నారన్నారని విమర్శించారు.

మోడీ ముఖంలో కెసిఆర్ భయం స్పష్టంగా కనిపించింది

ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర రోడ్లు భవనాలు,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మంత్రుల నివాస సముదాయంలోని తన అధికారిక నివాసంలో మీడియాతో మాట్లాడుతూ, హైదరాబాద్‌లో మోడీ మాట్లాడుతుంటే ఆయన మొఖంలో సిఎం కెసిఆర్ భయం స్పష్టంగా కనిపించిందన్నారు. ఆ భయంతో శరామామూలైన ఏవేవో అసత్యాలు, అబద్ధాలు మాట్లాడారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 14 జాతీయ రహదారులు పెండింగ్‌లో ఉన్నాయని వాటిపై ఏదో ఒక ప్రకటన చేస్తారని సంబంధిత శాఖ మంత్రిగా అవి ప్రకటిస్తారని ఆశించానన్నారు. కానీ అందులో దేనిపై మోడీ ఒక ప్రకటన కూడా చేయలేదని విమర్శించారు. దీనిపై సిఎం కెసిఆర్ పలుమార్లు ప్రధానిని కలిసి అడిగారన్నారు. అనేక సంఖ్యలో లేఖలు రాశారని గుర్తు చేశారు. తెలంగాణలో జాతీయ రహదారుల కోసం కేంద్రం 1లక్ష 25 వేల కోట్లు కాగితాల మీద మంజూరు చేసి ఇప్పటివరకు ఖర్చు చేసింది మాత్రం రూ. 20వేల కోట్లేనని అన్నారు. అంటే ఏడాదికి రూ. 2వేల కోట్ల చొప్పున ఖర్చు చేస్తూ పోతే వాటిని 50 ఏళ్లకు పూర్తి చేస్తారా? అని మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. తల్లిని చంపి బిడ్డను బ్రతికించారని తెలంగాణ పుట్టుకనే పార్లమెంట్ వేదికగా వెక్కిరించిన మోడీకి తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉన్నదంటే ఎలా నమ్ముతమన్నారు.

ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడైన నరేంద్ర మోడీ…అవినీతి గురించి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉన్నదన్నారు. మోడీ దోస్త్ అదానీ రూ.50 వేల కోట్ల నుండి రూ. 12 లక్షల కోట్లకు ఎలా పెరిగాడని ప్రశ్నించారు. ఎల్‌ఐసి,ఎస్‌బిఐలలో ప్రజలు దాచుకున్న డబ్బును ఎవడబ్బ సొమ్మని అదానీ కంపెనీలకు మల్లించావని నిలదీశారు. అదానీ అవినీతిపై జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తే ….ఎందుకు పారిపోయవని ఎద్దేవా చేశారు. నరేంద్ర మోడీ శ్రీరామచంద్రుడు,సచ్చీలుడైతే మోడీ,అదానీ దోస్తాన్ మీద,అదానీ కంపెనీల మీద ఈడి,సిబిఐ విచారణ జరపాలని మంత్రి వేముల డిమాండ్ చేశారు.
కెసిఆర్‌ను కుటుంబ పాలన అంటూ విమర్శిస్తున్న మోడీది కార్పొరేట్ల బినామీల పాలన..పేదొడిని గోస పెడుతున్న అసమర్థ పాలన అని మండిపడ్డారు. మోడీ అసమర్ధత వల్లే పెట్రోల్, డీజిల్,వంట గ్యాస్, నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుడి మీద పెనుభారం పడుతుందన్నరు. దేశంలో నిరుద్యోగం పెరిగిందని, రూపాయి మారకం విలువ పతనం అయ్యిందని దుయ్యబట్టారు.

మోడీ మరోసారి విషం చిమ్మారు

రైలు ప్రారంభం పేరుతో తెలంగాణలో పర్యటించిన ప్రధాని మోడీ ఈ ప్రాంతంపై మరోసారి విషం చిమ్మారని విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి ప్రధాని నరేంద్ర మోదీ తట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు. మోడీ ప్రసంగం మొత్తం మోసపూరితంగా సాగిందని విమర్శించారు. సిఎం కెసిఆర్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుండగా బిజెపి పాలనలో అవినీతిమయంగా మారిందని ఆరోపించారు. బిజెపి ప్రతిఘటిస్తున్నందుకే బిఆర్‌ఎస్‌తో సహా విపక్షాలపై సిబిఐ, ఇడి, ఐచి తదితర కేంద్ర సంస్థలను ఎగదోస్తున్నారని ఆరోపించారు. దారికి వచ్చి కాషాయ గూటికి చేరితే మాఫీ.. లేదంటే అక్రమ కేసులతో సతాయించడం ఢిల్లీ పెద్దలకు పరిపాటిగా మారిందన్నారు. సిఎం కెసిఆర్ అంటేనే ఢిల్లీ పెద్దలకు వణుకు మొదలైందన్నారు. అందులో భాగమే హైదరాబాద్ పర్యటనలో తెలంగాణాపై ప్రధాని విద్వేషపు ప్రసంగమంటూ మంత్రి మండిపడ్డారు.

రాష్ట్రానికి మళ్ళీ మొండి చేయి ఇచ్చారు

ప్రధాని మోడీ మళ్లీ రాష్ట్రానికి మొండి చేయి ఇచ్చారని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఆయన చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆయన హైదరాబాద్ పర్యటనలో రాష్ట్రానికి ఉపయోగపడే ఒక్క మంచి ముచ్చట కూడా.. ప్రకటన కూడా చేయలేదన్నారు. మోడీ ప్రసంగం ఆధ్యాంతం తెలంగాణపై ఆక్రోషంతోనే సాగిందన్నారు. రాష్ట్రంపై ఆయన మరోసారి తన అక్కసును వెళ్లగక్కారని విమర్శించారు. కొత్త రాష్ట్రంగా తెలంగాణ సాధించిన ప్రగతిపై ఒక్క మాట కూడా మోడీ నుంచి రాలేదని…. ఇది దురదృష్టకరమన్నారు. ప్రధాని హోదాలో గౌరవం …గౌరవప్రదమైన స్థానంలో ఉన్న మోడీ విశాల దృక్పథంతో ఉండాలనిగానీ. సంకుచిత మనస్తత్వం ఉంటే ఎలా..? అని ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వం వద్ద గత ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రాష్ట్రానికి రావలసిన 14 జాతీయ రహదారులను మంజూరు చేస్తున్నట్లు మోడీ ప్రకటిస్తారని ఆశించాం…. కానీ ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. కాలేశ్వరం, పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులకు మోడీ జాతీయ హోదా ప్రకటిస్తారన్న ఆశ నిరాశగానే మిగిలిపోయిందన్నారు. కుట్రలు, కుతంత్రాలు మోడీకి తెలిసినట్లుగా మరెవరికి తెలియవన్నారు. ప్రతిపక్ష పార్టీలను చీల్చి అక్రమంగా అధికారంలోకి రావడమే ప్రస్తుత బిజెపికి ఉన్న ముఖ్య లక్ష్యమన్నారు. దేశంలో అనేక రాష్ట్రాలలో ప్రతిపక్ష పార్టీలను చీల్చి ప్రతిపక్ష శాసనసభ్యులను కొనుగోలు చేసి అక్రమంగా బిజెపి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. కుటుంబ పాలనపై మాట్లాడే నైతిక హక్కు నరేంద్ర మోడీకి లేనేలేదన్నారు. తెలంగాణ స్వరాష్టం కోసం పోరాటాలు చేసి, జైళ్లకు వెళ్లి, ప్రజల చేత ఎన్నుకోబడిన చరిత్ర ఉన్న బిఆర్‌ఎస్ పార్టీపై కుటుంబ పాలన అంటూ కామెంట్ చేసే అర్హత ఆయనకు ఎక్కడిదని ప్రశ్నించారు. బిజెపిలో దేశ వ్యాప్తంగా కేంద్రంలోని మంత్రులు, ఆయా రాష్ట్రాల్లోని బిజెపి నాయకుల కుటుంబ సభ్యులు అధికారాన్ని అనుభవిస్తున్నారు.. ఇది నిజం కాదా?బోయినపల్లి నిలదీశారు. జాతీయ రహదారులు, నీటిపారుదల ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు లు ఏమైనా ప్రకటిస్తాడు కావచ్చు అనుకున్న కనీసం మాట ఎత్తలేదన్నారు.

రాష్ట్రం అవినీతిలో కూరుకుపోతే కేంద్రం ఎందుకు అవార్డులు ఇస్తోంది

ప్రధాని రాష్ట్రానికి వచ్చి ఏమైనా ప్రాజెక్టులు ఇస్తారనుకుంటే….. కేవలం తిట్టిపోయిండని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. బిఆర్‌ఎస్ ఎల్‌పి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. గతంలో కెసిఆర్ పాలనను ప్రధాని మెచ్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు. కెసిఆర్ కుటుంబాన్ని తిట్టడం తప్ప మోడీకి ఏమీ చేత కాదన్నారు. అదానీ కోసమే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని పక్కన బెట్టారన్నారు. బిజెపి గతంలో కుటుంబ పార్టీలతో పొత్తు పెట్టుకోలేదా? అంటూ అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోతే కేంద్రం అవార్డులు ఎందుకు ఇస్తోందని నిలదీశారు.

ఏ అంశంలోనైనా తెలంగాణతో ఇతర రాష్ట్రాలు పోటీ పడుతున్నాయా? అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. ఏ దాంట్లో అయినా బిజెపి పాలిత రాష్ట్రాలు తెలంగాణ కంటే ముందున్నాయా? అని అడిగారు. సిబిఐని మోడీ గతంలో కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనలేదా? అని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఇచ్చిన విధంగా రాష్ట్రంలోని కాళేశ్వరానికి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదన్నారు. జాతీయ రహదారులు తెలంగాణ హక్కు అన్నారు. సున్నం వేసి ఇల్లు నాదే అన్నట్టుగా మోడీ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేంద్రం ప్రాజెక్టులు చూసి నత్తలు కూడా సిగ్గు పడుతున్నాయన్నారు. ఉప్పల్ ఫ్లై ఓవర్ నిర్మాణానికి ఇంకా ఎంత సమయం తీసుకుంటారన్నారు.

నిరాశ పరిచిన మోడీ పర్యటన

రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్రమోడీ పర్యటన పూర్తిగా నిరాశ పరిచిందని మంత్రు గంగుల కమలాకర్ అన్నారు. ఆయన పర్యటనతో రాష్ట్రానికి కొత్తగా ఒక్క రూపాయి మేలు జరగలేదన్నారు. పైగా రాష్ట్ర ప్రభుత్వంపై కుళ్లు మాటలు మాట్లాడిపోయారని విమర్శించారు. యాసంగి పంట కొనుగోలుపై ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకుండా రైతులను నిరాశ పరిచారన్నారు. రేషన్ కార్డుల సంఖ్యను పెంచుతారనుకుంటే అది కూడా చేయలేదన్నారు. రేషన్ బియ్యంపై ప్రధాని పదవిలో ఉండి అబద్దాలు ఆడడం దురదృష్టకరమన్నారు. రేషన్ బియ్యం పేదలకు ఇవ్వకుండా ఎవరు అడ్డుకున్నారని, కుటుంబానికి బియ్యం కోటా పెంచింది రాష్ట్ర ప్రభుత్వం తప్ప కేంద్రం కాదన్నారు. రేషన్ బియ్యంపై రూ.27వేలకోట్లు ఖర్చు చేశామన్నారు. గురుకులాల గురించి మోడీ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. వ్యవసాయం, పిడిఎస్ గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదన్నారు. వెనకబడిన వర్గాలకు మోదీ చేసింది శూన్యమన్నారు. వెనకబడిన వర్గాలకు విద్యను అందించింది కెసిఆర్‌యేనని అన్నారు. అవినీతి బిజెపి సిఎంలపై సిబిఐ విచారణ ఎందుకు జపపారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News