Monday, April 29, 2024

బిఆర్ఎస్ యుద్ధ భేరీ

- Advertisement -
- Advertisement -

115 మంది జాబితాతో అధినేత కెసిఆర్ ఎన్నికల నగారా

టార్గెట్ 95-105

2023 ఎన్నికల రణరంగంలో విజయం మాదే

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. మిగిలిన పార్టీలకంటే ముందుగానే బిఆర్‌ఎస్ తన అభ్యర్థులను ప్రకటించింది. సో మవారం బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమం త్రి కె. చంద్రశేఖరరావు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థ్ధులకు సంబంధించి మొదటి జాబితాను ప్రకటించారు. తాను రెండు స్థ్ధానాలు కామారెడ్డి, గజ్వేల్ నుంచి పోటీ చేయనున్నట్టు రు. మంచి ముహూర్తం ఉండడంతో అభ్యర్థ్ధుల మొదటి జాబితాను ప్రకటించినట్టు కె సిఆర్ తెలిపారు. ముందు చెప్పినట్టుగానే సిట్టింగ్ అభ్యర్థ్దులకే అధిక ప్రాధాన్యతనిచ్చారు. నాలుగు స్థ్ధానాలను మినహా 115 స్థ్ధానాల్లో అభ్యర్థ్ధులను ప్రకటించగా, ఇం దులో ఏడుగురు సిట్టింగ్ ఎంఎల్‌ఎలు (వేములవాడ, ఖానాపూర్, బోథ్, ఆసిఫాబా ద్, వైరా, స్టేషన్‌ఘన్‌పూర్, ఉప్పల్) మా త్రం సిట్టింగ్‌లకు టికెట్ ఇవ్వకుండా కొత్త వారికి అవకాశం కల్పించారు. నర్సాపూర్, జనగాం, నాంపల్లి, గోషామహల్ నియోజక వర్గాలను పెండింగ్‌లో ఉంచారు. వచ్చే మూడు, నాలుగు రోజుల్లో వీటిపై నిర్ణయం తీసుకుంటామని కెసిఆర్ వెల్లడించారు. అభ్యర్థుల్లో పెద్దగా మార్పులు, చేర్పులు చేయకపోవడానికి వారి పనితీరు బాగుండడం వల్ల తిరిగి వారికి అవకాశం కల్పించినట్టు సిఎం పేర్కొన్నారు. కాగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీటును ఇటీవల కన్నుమూసిన జి. సాయన్న కూతురు లాస్య నందితకు కేటాయించినట్లు వెల్లడించారు. కొన్ని కారణాలవల్ల ఏడుగురు సిట్టింగ్ అభ్యర్థులకు టికెట్ నిరాకరించినట్లు సిఎం చెప్పారు. హుజూరాబాద్ స్థానంలో కౌశిక్‌రెడ్డి, వేములవాడలో చల్మెడ లక్ష్మీనరసింహారావులు పోటీ చేయనున్నట్లు కెసిఆర్ తెలిపారు. కోరుట్ల ఎంఎల్‌ఎ విద్యాసాగర్‌రావు అభ్యర్థన మేరకు ఆ స్థానాన్ని ఆయన కుమారుడు సంజయ్‌కి కేటాయించినట్లు సిఎం వెల్లడించారు. నాలుగు స్థానాలు మాత్రం పెండింగ్‌లో ఉన్నాయని, ఎవరిని నిలబెట్టాలో పరిశీలిస్తున్నట్లు చెప్పారు. మైనంపల్లి హన్మంతరావుకు కూడా టికెట్ కేటాయించామని, ఆయన పోటీ చేస్తారో, చేయరో తన ఇష్టమని సిఎం తెలిపారు. అన్నీ సర్దుబాటు చేసుకొనే ముందుకు వెళ్తున్నామన్నారు. భూపాలపల్లిలో వెంకటరమణా రెడ్డికి మాజీ స్పీకర్ మధుసూదనాచారి, తాండూరులో పైలట్ రోహిత్ రెడ్డికి మహేందర్ రెడ్డి మద్దతిస్తున్నామని చెప్పారన్నారు.
ప్రగతి ఎజెండా మాది
తెలంగాణను ప్రగతిబాటలో నడిపిస్తూ దేశంలో తెలంగాణ ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దినట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. పాలనలో అవినీతికి తావులేకుండా ముందుకు సాగుతున్నామన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే తమను మరోసారి విజయం వైపు తీసుకు వెళ్తాయని కెసిఆర్ అన్నారు. ఎన్నికల మేనిఫెస్టో గురించి ఇప్పుడే ఏం చెప్పమని, త్వరలోనే రాష్ట్ర చూస్తారని చెప్పారు. మేనిఫెస్టోలో చెప్పనివి ఎన్నో సం క్షేమ పథకాలు ప్రస్తుతం అమలు జరుగుతున్నాయన్నా రు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, దళితబంధు, రైతుబంధు ఇలా ఎన్నో పధకాలు మేనిఫెస్టోలో పేర్కొనకున్నా అమలు చేస్తున్నట్టు చెప్పారు. క్రమశిక్షణగల పార్టీగా రాష్ట్రాన్ని ప్రగతి పథం వైపు నడిపిస్తున్నామని అన్నారు. దేశంలోనే బెస్ట్ స్టేట్‌గా తెలంగాణ మారిందని, ఆర్‌బిఐ, నీతి వంటి సంస్థలే గుర్తించాయన్నారు. మెడికల్ కాలేజీ, ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ వంటివి సమకూర్చిన రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటేనని స్పష్టం చేశారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేక మాపై బిజెపి, కాంగ్రెస్ వంటి పార్టీలు విషయం చిమ్ముతున్నాయని విమర్శించారు. 24గంటల కరెంట్ ఇస్తుంటే ఒకడేమో 3గంటలే చాలంటున్నారు. వారు అధికారం వెలగబెడుతున్న కర్నాటకలో అప్పుడే విద్యుత్ కోతలు మొదలయ్యాయని అన్నారు. కాంగ్రెస్, బిజెపిలు అలవి కాని వాగ్ధానాలు చేస్తున్నాయని ఆరోపించారు. అవన్నీ ఆపదమొక్కుల పార్టీలేనని, ఎన్నికల సమయంలోనే హామీలు గుప్పిస్తుంటాయని ఎద్దేవా చేశారు.
యుద్ధానికి సిద్ధం
వచ్చే ఎన్నికలు యుద్ధం వంటిదేనని, కాంగ్రెస్, బీజేపీలను ఢీకొని విజయం సాధిస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేవారు. అతి తక్కువ సమయంలోనే తెలంగాణను అభివృద్ధి చేసిన పార్టీ బీఆర్‌ఎస్ అన్నారు. రాష్ట్రంలో ఎన్నికల తర్వాత దేశ రాజకీయాలపై దృష్టిపెట్టనున్నట్టు కేసీఆర్ తెలిపారు. మిషన్ టు ఛేంజ్ ఇండియా అన్న లక్షంతో పనిచేస్తామన్నారు. కేంద్రంలోనూ తామే అధికారంలోకి వస్తామన్నారు. కాంగ్రెస్, బీజేపీల మాదిరిగా అవినీతి, కుంభకోణాలు చేయలేదని, దేశ ప్రజలు కూడా బీఆర్‌ఎస్ ఆశగా చూస్తున్నారన్నారు. బిజెపి గెలుస్తుందనేది జోక్ ఆఫ్ ది సెంచరీగా అభివర్ణించారు.
మజ్లిస్‌తో దోస్తీ కొనసాగుతుంది
మజ్లిస్ పార్టీతో బిఆర్‌ఎస్ దోస్తీ కొనసాగుతుందని కెసిఆర్ స్పష్టం చేశారు. 2014 నుంచి ఇరుపార్టీల మధ్య మిత్ర సంబంధం ఉందన్నారు. రెండు పార్టీలు కలిసి గ్రేటర్ పరిధిలో 29 కైవసం చేసుకుంటాయని, లోక్‌సభ ఎన్నికల్లోనూ 17 సీట్లలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత లోక్‌సభ ఎన్నికలపై దృష్టిపెడతామని, ఆ ఎన్నికల్లో కూడా ఎవరితోనూ పొత్తు ఉండదని కెసిఆర్ స్పష్టం చేశారు. ఈసారి పార్టీ నిర్ణయించిన అభ్యర్థ్ధుల విజయానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. బిఆర్‌ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ కాదని, అచ్చంగా రాజకీయ పార్టీయేనని ముఖ్యమంత్రి పునరుద్ఘటించారు. ఈసారి ఎన్నికల్లో పోటీచేసేందుకు అవకాశం రాని వారెవరూ చిన్న బుచ్చుకోవద్దని సూచించారు. బిఆర్‌ఎస్ సముద్రం వంటిదని, పెద్దఎత్తున ప్రతి ఒక్కరికీ అవకాశాలు వస్తాయని చెప్పారు. టికెట్ రానివారు కూ డా పార్టీలోనే ఉండాలని, రాజకీయ జీవితమంటే ఎంఎల్‌ఎగా పనిచేయడమే కాదని, ఎంఎల్‌సి, రాజ్యసభ, జడ్ పి చైర్మన్లు వంటి అనేక అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. ఇతర పార్టీలకు పొలిటికల్ గేమ్ అని, కానీ బిఆర్‌ఎస్‌కు ఓ టాస్క్ వంటిదన్నారు. ఎన్నికలను పవిత్ర యజ్ఞంలా భావించి ముందుకెళ్తామన్నారు.
అక్టోబర్ 16న వరంగల్‌లో ‘సింహగర్జన’
అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో బీఆర్‌ఎస్ విజయం సాధిస్తుందని, ఈ మేరకు అక్టోబరు 16న వరంగల్‌లో ‘సింహగర్జన’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు కెసిఆర్ వెల్లడించారు. ఈ సభలోనే ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటిస్తామన్నారు.
ముహుర్తం చూసుకుని జాబితా విడుదల
ఏదైనా మంచి కార్యం తలపెట్టే ముందు శుభముహూ ర్తం చూసుకొని ప్రారంభించడం సిఎం కెసిఆర్‌కు అలవాటు. బిఆర్‌ఎస్ పార్టీ ఎంఎల్‌ఎ అభ్యర్థుల జాబితా విడుదలలో కూడా ఆయన యథావిధిగా ఈ సంప్రదాయాన్ని శ్రావణ సోమవారం మధ్యాహ్నం 2.38గంటలకు ధనుర్లగ్న శుభాంశములో పార్టీ అభ్యర్థుల జాబితాను కెసిఆర్ ప్రకటించారు. అత్యంత శుభప్రదమైన ఈ ముహూర్తంలో తలపెట్టిన కార్యాలు దిగ్విజయమవుతాయని నమ్మకం.
జాబితాలో ఏడుగురు మహిళలకు స్థానం
వచ్చే అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల జాబితాలో ఏడుగురు మహిళలకు బిఆర్‌ఎస్ పార్టీ చోటు కల్పించింది. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకుగాను 115 స్థానాలకు సోమవారం బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, సిఎం కెసిఆర్ అభ్యర్థులను ప్రకటించారు. అందులో ఏడుగురు మహిళలకు స్థానం దక్కింది. 2018లో నలుగురు మహిళా అభ్యర్థులకు టికెట్లు ఇవ్వగా వారిలో ముగ్గురు విజయం సాధించారు. ఈసారి అదనంగా ముగ్గురు మహిళలకు జాబితాలో స్థానం కల్పించారు.
కులాల వారీగా సీట్ల కేటాయింపు
ఈసారి అన్ని వర్గాలకు న్యాయం చేసేలా బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ చర్యలు తీసుకున్నారు. కులాల వారీగా ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు, గెలుపును దృష్టిలో ఉంచుకుని సీట్ల కేటాయింపు జరిగిందని తెలిపారు. ఇక కులాల వారీగా సీట్ల కేటాయింపు పరిశీలిస్తే 40 రెడ్లు,12 వెలమ,1 వైశ్య,2 బ్రాహ్మణ,4 ఖమ్మ , 29 ఎస్‌సి, ఎస్‌సి రిజర్వ్ సీట్లు, 3 మైనారిటీ, 24 బీసీలకు సీట్లు కేటాయించారు.
ఈసారి ఛాన్స్ దక్కని సిట్టింగులు వీరే..
తాటికొండ రాజయ్య – స్టేషన్‌ఘన్‌పూర్, రేఖానాయక్ -ఖానాపూర్, చెన్నమనేని రమేశ్,- వేములవాడ, గంప గోవర్ధన్-, కామారెడ్డి, రాథోడ్ బాపూరావ్ బోథ్, ఉప్పల్- భేతి సుభాష్‌రెడ్డి, వైరా- రాములు నాయక్.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News