Friday, May 17, 2024

అంతర్జాతీయ సరిహద్దుల్లో పాక్ చొరబాటుదారుని కాల్చివేత

- Advertisement -
- Advertisement -

BSF guns down Pakistani intruder along border in J&K

జమ్మూ/న్యూఢిల్లీ: జమ్మూలోని భారత్-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద చొరబాటుకు యత్నించిన ఒక పాకిస్తానీ చొరబాటుదారుడిని సరిహద్దు భద్రతా దళం(బిఎస్‌ఎఫ్) సిబ్బంది కాల్చివేశారు. సంబా సెక్టార్‌లోని చక్ ఫకీరా సరిహద్దు పోస్టు(సరిహద్దు స్తంభం 64 వద్ద) సోమవారం ఉదయం 9.45గంటల ప్రాంతంలో జరిగినట్లు అధికారులు తెలిపారు. పదేపదే హెచ్చరించినప్పటికీ ఆ చొరబాటుదారుడు సరిహద్దు కంచెను సమీపించసాగాడని, తప్పనిసరి పరిస్థితుల్లో బిఎస్‌ఎఫ్ జవాన్లు కాల్పులు జరిపారని బిఎస్‌ఎఫ్ ప్రతినిధి ఒకరు తెలిపారు. పాకిస్తానీ చొరబాటుదారుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. అంతర్జాతీయ సరిహద్దుకు 40 మీటర్ల దూరంలో భారత భూభాగంలో మృతదేహం లభించిందని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News