Wednesday, May 8, 2024

2023 సెప్టెంబర్ నాటికి ఐడిబిఐ ప్రైవేటీకరణ పూర్తి!

- Advertisement -
- Advertisement -

By September 2023 IDBI Privatization complete!

న్యూఢిల్లీ : ఐడిబిఐ బ్యాంక్ ప్రైవేటీకరణకు బిడ్లను మార్చి నెల వరకు ఆహ్వానించి, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. 2023 సెప్టెంబర్ వరకల్లా బ్యాంక్ ప్రైవేటీకరణ ప్రక్రియ పూర్తవుతుందని వారు తెలిపారు. ఇటీవల ఐడిబిఐ బ్యాంక్ ప్రైవేటీకరణకు ప్రభుత్వం ఇన్వెస్టర్ల నుంచి బిడ్లను ఆహ్వానించింది. బ్యాంకులో కేం ద్రానికి, ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్‌ఐసికి చెందిన 60.72 శాతం వాటాను విక్రయించనున్నారు. ప్రభుత్వం, ఎల్‌ఐసి(లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) ఈ రెండింటికి ఐడిబిఐ బ్యాంకులో 94% వాటాలు ఉన్నాయి. దీనిలో 60.72% వాటాను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించి, బిడ్లను ఆహ్వానించింది. ప్రభుత్వం 30.48% వాటాను, ఎల్‌ఐసి 30.24 వాటాను విక్రయించనున్నాయని డిఐపిఎఎం(పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం) తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News