Friday, April 26, 2024

8న భారత్ బంద్‌కు పిలుపు

- Advertisement -
- Advertisement -

Call for Bharat Bandh on the 8th

 

కేంద్రం మా డిమాండ్లను అంగీకరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తాం: రైతు సంఘాలు
రైతులను తక్షణం ఖాళీ చేయించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలంటూ రైతుల చేపట్టిన ఆందోళన మరింత తీవ్రం కానుంది. ఈ నెల 8న భారత్ బంద్ చేపట్టాలని రైతు నాయకులు పిలుపునిచ్చారు. ఈ రోజు జరిగిన సమావేశంలో ఈ నెల8న భారత్ బంద్‌కు పిలుపునివ్వాలని నిర్ణయించాం. ఆరోజు ఢిల్లీ మార్గాల్లో ఉన్న అన్ని టోల్ ప్లాజాలను ఆక్రమిస్తాం’ అని రైతు సంఘం నాయకుడు గుర్నామ్ సింగ్ చందోని శనివారం విలేఖరులతో మాట్లాడుతూ చెప్పారు. శనివారం జరిగిన చర్చల్లో తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించని పక్షంలో తమ ఆందోళను ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరాం. ఈ నెల 5న (శనివారం) దేశవ్యాప్తంగా ప్రధాని దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తాం. ఈనెల 8న భారత్ బంద్ పాటించాలని పిలుపునిస్తున్నాం. ఆ రోజు ఢిల్లీకి వెళ్లే అన్ని రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాలను ఆక్రమిస్తాం’ అని మరో రైతు నాయకుడు, బారతీయ కిసాన్ యూనియన్ లోఖోవాల్ జనరల్ సెక్రెటరీ హర్విందర్ సింగ్ తెలిపారు.

సుప్రీంకోర్టులో పిటిషన్

ఇదిలా ఉండగా దదేరాజధాని సరిహద్దుల్లో అన్నదాతల చేపట్టిన ఆందోళన వ్యవహారం సర్వోన్నత న్యాయస్థానానికి చేరింది. రైతుల నిరసనలతో కొవిడ్ వైరస్ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున వారిని వెంటనే అక్కడినుంచి ఖాళీ చేయించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.‘ కొవిడ్ వైరస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదకర వైరస్ అయినందున ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న లక్షలాది మంది రైతుల ప్రాణాలకు ముప్పు ఉందని, ఒక వేళ ఈ వ్యాధి సామాజిక వ్యాప్తిగా మారిన పక్షంలో దేశంలో భయానక పరిస్థితి తలెత్తుందని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఢిల్లీకి చెందిన న్యాయవిద్యార్థి రిషబ్ శర్మ ఈ పిటిషన్ దాఖలు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News