Monday, April 29, 2024

కోచింగ్ సెంటర్లను కట్టడి చేయలేం

- Advertisement -
- Advertisement -

విద్యార్థుల ఆత్మహత్యలకు తల్లిదండ్రుల ఒత్తిడే కారణం

విద్యా వ్యవస్థ నియంత్రణ న్యాయ వ్యవస్థది కాదు: సుప్రీం

న్యూఢిల్లీ: పోటీ పరీక్షల విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళనకరమే, అయితే దీనికి సంబంధించి కో చింగ్ సెంటర్ల కట్టడికి తాము ఏమీ చేయలేమని సుప్రీంకోర్టు నిస్సహాయత వ్యక్తం చేసింది. విద్యారంగంలో తదుపరి అవకాశాల కోసం తీవ్రస్థాయి పోటీ నెలకొంటోంది. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు కూడా తమ పిల్లల నుంచి మరింతగా చదువులో రాణింపును కోరుకుంటున్నారు. కాంపిటిటి వ్ పరీక్షలలో పిల్లలు నెగ్గాలని, అత్యుత్తమ ర్యాంకులు దక్కించుకోవాలని ఆశిస్తున్నారు. ఇవన్నీ కూడా విద్యార్థుల బలవన్మరణానికి దారితీస్తున్నాయని, ఈ పరిస్థితులలో ఎవరినో ఒక్కరిని దోషిగా ఖరారు చేయడం కుదరదని, కోచింగ్ సెంటర్లపై న్యాయవ్యవస్థ కట్టడి కుదరదని సుప్రీంకోర్టు తెలిపింది.

అత్యంత కీలకమైన, భావితరాలకు సంబంధించిన ఈ ఆత్మహత్యల ఉదంతాల కేసుపై సోమవారం న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, ఎస్‌విఎన్ భట్టితో కూడిన ధర్మాసనం రూలింగ్ వెలువరించింది. కొన్ని ప్రాంతాలలో పుట్టగొడుగులుగా వెలిసిన కోచింగ్ సెంటర్ల కట్టడికి దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. ఈ విషయంపై జుడిషియరీ చేసేదేమీ లేదని స్పష్టం చేసింది. ఆ త్మహత్యలు మామూలు విషయాలు కావు. ఏది ఏమైనా తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి వల్లనే ఇటువంటి బలవన్మరణాలు చోటుచేసుకుంటున్నా యి. పిల్లలు ఒత్తిడికి గురి కావడం కాదు , వారి పై వారి తల్లిదండ్రులు ఎక్కువగా ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఇది అంతర్గత విషయం. దీనిపై న్యా యస్థానం ఎటువంటి స్పందనకు దిగగలదు? అని న్యాయస్థానం ప్ర శ్నించింది. ముంబైకి చెందిన డా.అనిరుద్ధ నారాయణ్ మల్పాని దాఖలు చేసిన పిటిషన్‌పై లాయరు ప్రి యా తమ వాదన విన్పించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News