Monday, April 29, 2024

డీమోనిటైజేషన్ జరిగి 5 ఏళ్లు అయినా… క్యాష్ ఈజ్ ద కింగ్!

- Advertisement -
- Advertisement -
Money
ప్రజల వద్ద నగదు రొక్కం  పెరుగుతోంది!

ముంబయి: భారత రిజర్వు బ్యాంకు(ఆర్‌బిఐ) డేటా ప్రకారం డీమోనిటైజేషన్ జరిగి దాదాపు 5 ఏళ్లు పూర్తి కావస్తున్నా ప్రజల వద్ద నగదు తగ్గకపోగా మరింత పెరిగింది. దీపావళికి ముందు ప్రజల వద్ద రూ. 15582 కోట్లు మేరకు నగదు పెరిగింది. అంటే ఏడాదికేడాది(ఇయర్ ఆన్ ఇయర్) లెక్కన చూస్తే రూ. 2.21 లక్షల కోట్లు లేదా 8.5 శాతం పెరిగింది. ప్రభుత్వం పాత కరెన్సీని ఆపేసి కొత్త కరెన్సీని చెలామణిలోకి తెచ్చేందుకు, పాత కరెన్సీని స్ట్రిప్పింగ్ చేయడానికి, అవినీతిని, నల్లధనాన్ని అరికట్టేందుకు, ద్రవ్యోల్బణాన్ని ఆపేందుకు, కొత్త ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు ‘డీమోనిటైజేషన్’ చేసింది. కానీ సాధించేందేమిటో కేంద్ర ప్రభుత్వమే వివరించాలి. 2016 నవంబర్ 8న ప్రభుత్వం రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేసింది. అప్పట్లో ప్రజల వద్ద రూ.17.97 లక్షల కోట్లు నగదు ఉండింది. కాగా మోనటైజేషన్ జరిగాక 2017 జనవరికల్లా ప్రజల వద్ద నగదు రూ. 7.8 లక్షలకు తగ్గిపోయింది. కానీ ఆ తర్వాత కొత్త రూ. 500, రూ. 2000నోట్లను చెలామణిలోకి తెచ్చారు. కాగా 2021 అక్టోబర్ 8 నాటికి ప్రజల వద్ద నగదు రూ. 28.30 లక్షల కోట్లు ఉంది. ఇది డీమోనిటైజేషన్ ముందుకంటే 57.48 శాతం ఎక్కువ. అంటే ప్రజల వద్ద నగదు రొక్కం 211 శాతం పెరిగిందని అర్థం. 2016 నవంబర్ 25 నాటికి ప్రజల వద్ద ఉన్న నగదు రొక్కం రూ. 9.11 లక్షల కోట్లే. ‘లెస్ క్యాష్ సొసైటీ’ దిశలో ప్రభుత్వం, ఆర్‌బిఐ చర్యలు చేపట్టినప్పటికీ సిస్టంలో నగదు పెరుగుతోందే తప్ప తగ్గడంలేదు. వివిధ లావాదేవీలలో ఆంక్షలు విధించినప్పటికీ, డిజిటైజేషన్ పేమెంట్ మెథడ్‌ను ప్రోత్సహించినప్పటికీ ప్రజల వద్ద నగదు రొక్కం పెరుగుతోందన్నది యథార్థం. కరెన్సీ ఇన్ సర్కులేషన్(సిఐసి) పెరిగిందే కానీ తగ్గలేదు. డీమోనిటైజేషన్ తర్వాత స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) తగ్గినప్పటికీ కరెన్సీ మాత్రం పెరిగిందనే చెప్పాలి. ఇప్పటికీ ప్రజలు నగదు లావాదేవీలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. డిజిటల్ లావాదేవీలు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి. గత మూడేళ్లలో సిఎంఎస్ క్యాష్ సూచీ కూడా 9 నుంచి 19 శాతానికి పెరిగిందని సిఎంఎస్ ఇన్ఫో తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News