Monday, April 29, 2024

రంజిత్‌సింగ్ హత్య కేసులో డేరాబాబాను దోషిగా తేల్చిన సిబిఐ కోర్టు

- Advertisement -
- Advertisement -

CBI court convicts Dera Baba in Ranjit Singh murder case

చండీగఢ్: 2002లో జరిగిన రంజిత్‌సింగ్ హత్య కేసులో డేరా సచ్చాసౌదా చీఫ్ రామ్హ్రీమ్‌సింగ్(డేరాబాబా)తోపాటు మరో నలుగురిని పంచకులలోని సిబిఐ ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చింది. వీరికి అక్టోబర్ 12న శిక్షలు ఖరారు చేయనున్నది. హర్యానా రాష్టం సిర్సాలోని డేరా సచ్చాసౌదా ఆశ్రమంలో మేనేజర్‌గా పని చేసే రంజిత్‌సింగ్ థానేసర్(హర్యానా) పోలీస్‌స్టేషన్ పరిధిలో 2002 జులై 10న హత్యకు గురయ్యారు. రంజిత్ హత్యపై పలు అనుమానాలు వ్యక్తం కావడంతో సిబిఐ దర్యాప్తునకు పంజాబ్‌హర్యానా హైకోర్టు 2003, నవంబర్ 10న ఆదేశించింది.

ఆశ్రమంలోని మహిళా సాథ్విలపై డేరాబాబా లైంగిక దాడులకు పాల్పడుతున్నాడన్న విషయాన్ని ఓ లేఖ ద్వారా రంజిత్‌సింగ్ బయటి ప్రపంచానికి తెలిపారు. దాంతో, డేరాబాబానే రంజిత్‌సింగ్‌ను హత్య చేయించారన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. మహిళా సాథ్విలపై లైంగిక దాడుల అంశాన్ని వెలుగులోకి తెచ్చిన సిర్సాలోని స్థానిక జర్నలిస్ట్ రామ్‌చందర్ ఛత్రపతి కూడా హత్యకు గురయ్యారు. ఛత్రపతి కేసులో సిబిఐ కోర్టు 2019లోనే తీర్పు వెల్లడించింది. ఆ కేసులో డేరాబాబాతోపాటు మరో ముగ్గురికి సిబిఐ కోర్టు జీవితఖైదు విధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News